OG Neha shetty: పవర్ స్టార్ హీరోగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బాయ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కించిన గ్యాంగ్ స్టార్ డ్రామా 'ఓజీ' ఈరోజు భారీ అంచనాల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంచనాలకు తగ్గట్లే సూపర్ హిట్ టాక్ తో థియేటర్స్ లో దుమ్మురేపుతోంది. చాలా కాలం తర్వాత పవన్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే సినిమా వచ్చిందంటూ సంబరాలు చేసుకుంటున్నారు అభిమానులు. సినిమాలో పవన్ చాలా కొత్తగా స్టైలిష్ అండ్ పవర్ ఫుల్ ఫుల్ గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించడం ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపింది. పవన్ డైలాగ్స్, ఎంట్రీ సీన్లు, యాక్షన్ సీక్వెన్స్ లకు థియేటర్లు అరుపులు, కేకేలతో దద్దరిల్లిపోయాయి.
నేహా పాప ఎక్కడ
అయితే ఈ సినిమాలో 'డీజీ టిల్లు' బ్యూటీ నేహా శెట్టి స్పెషల్ సాంగ్ లేకపోవడం కొంతమంది ఫ్యాన్స్ కు నిరాశ కలిగించింది. విడుదలకు ముందు నుంచే 'ఓజీ' లో నేహా స్పెషల్ సాంగ్ ఉండబోతుందని వార్తలు వచ్చాయి. ఓ ఈవెంట్ లో నేహా కూడా ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. గ్యాంగ్ స్టార్ డ్రామా నేపథ్యంలో ఫుల్ యాక్షన్ మోడ్ లో సాగే ఈ చిత్రంలో నేహా స్పెషల్ సాంగ్ సినిమాకు మంచి గ్లామర్ జోడిస్తుందని భావించారు. కానీ, థియేటర్స్ లో సాంగ్ లేకపోవడంతో ఎడిటింగ్ లో తీసేసినట్లు తెలుస్తోంది.
టిల్లు తర్వాత మంచి అవకాశం, సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న నేహాకు 'ఓజీ' స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ భావించారు. అంతేకాదు సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతుండడంతో నేహా క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కానీ, సినిమాలో నేహా సాంగ్ లేకపోవడం అభిమానులకు కాస్త నిరాశ కలిగించింది.
ఇదిలా ఉంటే. . మోడల్ గా కెరీర్ మొదలు పెట్టిన నేహా.. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. పూరి జగన్నాథ్ 'మెహబూబ ' సినిమతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత పలు సినిమాలు ఆశించిన విజయం రాలేదు ఈ ముద్దుగుమ్మకు. 2022లో డీజే టిల్లు సినిమతో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. ఈ సినిమాలో నేహా నటించిన పాత్ర యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది. మూవీలో నేహా గ్లామర్ కుర్రాళ్ళను ఫిదా చేసింది. మళ్లీ దీని తర్వాత నేహా రూల్స్ రంజన్, బెదురులంక, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇలా పలు చేసింది. కానీ అవి పెద్దగా సక్సెస్ తెచ్చిపెట్టలేదు. ప్రస్తుతం కెరీర్ లో మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తోంది నేహా.
Also Read: TheyCallHimOG: ఇది ఆరంభం మాత్రమే.. 'ఓజీ' సక్సెస్ వేళ ఫ్యాన్ బాయ్ సుజీత్ పోస్ట్ వైరల్!