/rtv/media/media_files/2025/07/11/pawan-kalyan-og-movie-shooting-completed-2025-07-11-19-05-55.jpg)
pawan kalyan og movie shooting completed
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘OG’ (Original Gangster) చిత్రం షూటింగ్ విజయవంతంగా పూర్తయింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ DVV ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. షూటింగ్ పూర్తయిన సందర్భంగా సరికొత్త, ఆసక్తికరమైన పోస్టర్‌ను కూడా విడుదల చేసింది.
Pawan Kalyan OG Movie
దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలవనుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ముంబై నేపథ్యంలో సాగే ఈ కథలో పవన్ కళ్యాణ్ ఒక పవర్ఫుల్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారు.
All shots fired and done..
— DVV Entertainment (@DVVMovies) July 11, 2025
Now it’s theatres’ turn…#OG’s ERA is set to stun…#TheyCallHimOG In Cinemas September 25th. #OGonSept25pic.twitter.com/C6S3XBxs1H
DVV ఎంటర్‌టైన్‌మెంట్స్ విడుదల చేసిన కొత్త పోస్టర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. పోస్టర్‌లో పవన్ కళ్యాణ్ ఇంటెన్స్ లుక్‌లో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. ‘‘అన్ని షూటింగ్‌లు అయిపోయాయి.. ఇప్పుడు థియేటర్ల వంతు.. ఓజీ ఆశ్చర్యపరచబోతోంది.’’ అంటూ మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ఈ అప్‌డేట్‌ను అందించారు.
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి, ప్రకాష్ రాజ్ వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, రవి కె. చంద్రన్ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
‘ఓజీ’ చిత్రాన్ని సెప్టెంబర్ 25, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇటీవల రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్నప్పటికీ, తన సినిమా షూటింగ్‌లను వేగంగా పూర్తి చేయడం అభిమానులకు ఆనందాన్ని కలిగించింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, ఇతర పోస్టర్‌లు సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధిస్తుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.