Pawan Kalyan: ప్రస్తుతం పవన్ ఫ్యాన్స్ 'ఓజీ' ట్రాన్స్ లో తేలిపోతున్నారు. కొద్దిసేపటి క్రితమే ట్రైలర్ విడుదలవగా.. అందులో పవన్ డైలాగ్స్, స్టైల్, యాక్షన్, స్క్రీన్ ప్రజెన్స్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించాయి. విడుదలైన క్షణాల్లోనే లక్షల వ్యూస్ తో సోషల్ మీడియాను షేక్ చేసింది. దీంతో సినిమా ఎప్పుడెప్పుడు చూడాలనే ఉత్సాహన్ని పట్టలేకపోతున్నారు. చాలా కాలం తర్వాత పవన్ పూర్తి స్థాయి మాస్ యాక్షన్ సినిమాలో కనిపించబోతున్నారు. దీంతో అభిమానుల అంచనాలు పీక్స్ కి చేరాయి. ఇదిలా ఉంటే.. 'ఓజీ'లో పవన్ రెమ్యునరేషన్ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
పవన్ రెమ్యునరేషన్
'ఓజీ' మూవీ కోసం పవన్ కళ్యాణ్ ఏకంగా రూ. 100 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. గతంలో కంటే ఇప్పుడు పవన్ మార్కెట్ భారీగా పెరిగింది. ఓవైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే మరోవైపు వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. దీంతో రెమ్యునరేషన్ కూడా గట్టిగానే తీసుకుంటున్నారని టాక్. 'హరిహర వీరమల్లు' కంటే ముందు చేసిన సినిమాలకు రూ. 60 - 70 కోట్లు చార్జ్ చేసేవాడని టాక్ ఉంది. ఇప్పుడు 'ఓజీ' కి మాత్రం నిర్మాత దానయ్య ఏకంగా రూ. 100 కోట్ల చెల్లించేందుకు ఒప్పుకున్నారట. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ రేంజ్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోలు చాలా తక్కువ మంది. ఇప్పుడుపవర్ స్టార్ కూడా ఆ లిస్ట్ లో చేరారు.
#OG ke 100 cr remuneration 💥
— mr.Ustaad🔥🦅 (@MrUstaad27) February 21, 2023
75cr+ remuneration + profits lo share @PawanKalyan#HariHaraVeeraMallupic.twitter.com/y3XFrnNRTc
అడ్వాన్స్ బుకింగ్స్ జోరు
విడుదలకు ఐదు రోజుల ముందు నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టారు. ఇప్పటికే హైదరాబాద్ లోని పలు ప్రముఖ థియేటర్లు హౌజ్ ఫుల్ బోర్డులు తిప్పేశాయి. ఇండియాతో పాటు ఓవర్ సీస్ లో కూడా 'ఓజీ' అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరుగుతున్నాయి. టికెట్ ధర ఎంతైనా సరే.. పవన్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడ్డానికి క్యూ కడుతున్నారు ఫ్యాన్స్. కొన్ని చోట్ల ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్లను వేలం పాట కూడా వేస్తున్నారు. వీటి కోసం కొంతమంది హార్డ్ కొర్ ఫ్యాన్స్ ఏకంగా లక్షలు ఖర్చు పెట్టడానికి కూడా సిద్ధమవుతున్నారు. భీమిలి మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు నక్క శ్రీధర్ రూ. 1.5 లక్షలు పెట్టి 'ఓజీ' టికెట్ కొనుగోలు చేశాడు.
ముంబై గ్యాంగ్ స్టార్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో పవన్ ఓజస్ గంభీర అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. ప్రియాంక, శ్రియా రెడ్డి, ఇమ్రాన్ హష్మీ, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో నటించారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందించారు. డీవీవీ బ్యానర్ పై దానయ్య నిర్మించారు.
Also Read: Allu Arjun - Atlee: లుక్కు ఊరమాస్.. అల్లు అర్జున్ హాలీవుడ్ రేంజ్ ఫోటో చూశారా?