OG Movie: ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలైన పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. పవన్ ఫ్యాన్స్ ని పూర్తిగా నిరాశపరిచింది. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ మూటకట్టుకుంది. దీంతో పవన్ ఫ్యాన్స్ ఆయన రాబోయే చిత్రాలు ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ పైనే ఆశలన్నీ పెట్టుకున్నారు. ఇప్పటికే 'ఓజీ' నుంచి విడుదలైన ఫైర్ స్ట్రామ్ సాంగ్, గ్లిమ్ప్స్ వీడియో అంచనాలను భారీగా పెంచేశాయి. ఈ క్రమంలో మూవీ నుంచి మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. 'ఓజీ' లో పవన్ సరసన హీరోయిన్ గా నటిస్తున్న ప్రియాంక మోహన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఇందులో ప్రియాంక 'కన్మణి' అనే పాత్రలో కనిపించనున్నట్లు తెలిపారు. చీరకట్టులో ప్రియాంక లుక్ ఎంతో కూల్ అండ్ సింపుల్ గా ఉంది. ప్రియాంక లుక్ చూస్తుంటే.. ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా లో.. ఎమోషనల్, ఫ్యామిలీ కంటెంట్ కూడా ఉండబోతోందని తెలుస్తోంది. దీంతో పాటు మరో సర్ప్రైజ్ కూడా ఇచ్చారు. మూవీ నుంచి సెకండ్ సింగిల్ ప్రోమోను త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిపారు.
Every storm needs its calm.
— DVV Entertainment (@DVVMovies) August 16, 2025
Meet KANMANI - @PriyankaaMohan ❤️
Very soon, let’s all meet with the soulful second single promo…#OG#TheyCallHimOGpic.twitter.com/hVXUbA99OD
దసరా కానుకగా విడుదల
'సాహూ' ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ఇటీవలే పవన్ కి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయినట్లు తెలిపారు. ప్రస్తుతం ఇతర నటీనటులకు సంబంధించిన సన్నివేశాలు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నట్లు సమాచారం. విడుదలకు ఇంకా కొంత సమయం మాత్రమే ఉండడంతో ప్రమోషన్స్ మొదలు పెట్టింది చిత్రబృందం. ఇందులో భాగంగానే సినిమాకు సంబంధించిన అప్డేట్లను ఒకదాని తర్వాత ఒకటి వదులుతున్నారు.
యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ పాన్ ఇండియా స్థాయిలో 'ఓజీ ' విడుదల కాబోతుంది.
పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాబోతున్న రెండవ చిత్రమిది. మొదటగా విడుదలైన హరి హర వీరమల్లు' నిరాశపరచడంతో 'ఓజీ' సినిమాతో పవన్ కళ్యాణ్ తన సత్తా చాటుతారని ఆశిస్తున్నారు అభిమానులు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే 'ఫైర్ స్ట్రోమ్' విడుదలైన పాటకు తమన్ కొట్టిన మ్యూజిక్, bgm ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపింది. 'ఓజీ' కి మ్యూజిక్ మరో హైలైట్ గా ఉండబోతుందన్ భావిస్తున్నారు.
Also Read: Kriti Sanon: వావ్! సముద్రం పక్కనే కృతి కొత్త ప్యాలెస్ .. ధర తెలిస్తే మైండ్ బ్లాంకే!