OG First Single: 'ఓజీ ' నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. పవన్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్!

పవన్ కళ్యాణ్ 'ఓజీ ' నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. 'OG Fire Storm' అంటూ విడుదల చేసిన ఈ పాట పవన్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్కిస్తోంది. పవర్ ఫుల్ లిరిక్స్, బీజేఎం ఆకట్టుకుంటున్నాయి. ఈ పాట ఈ పాటను మీకు కూడా చూసేయండి.  

New Update

OG First Single: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'ఓజీ' నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. సెప్టెంబర్ 25న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ షురూ చేశారు మేకర్స్. ఇందులో భాగంగా తాజాగా మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేశారు. 'OG Fire Storm'నజీరుద్దీన్, భరత్‌రాజ్, దీపక్ బ్లూ  ఈ పాటకు స్వరాలూ అందించారు.  ఇక  ఫీమేల్ వెర్షన్ సాంగ్ వచ్చేసి..  సింగర్  రాజకుమారి  ఆలపించారు. 

గ్యాంగ్ స్టార్ డ్రామా

గ్యాంగ్ స్టార్ డ్రామాగా తెరకెక్కిన  ఈ చిత్రాన్ని ప్రభాస్ 'సాహూ', 'రన్ రాజా రన్' ఫేమ్ సుజిత్ డైరెక్ట్  చేశాడు.  డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మించారు. ఇందులో పవన్ కళ్యాణ్ జోడిగా యంగ్ బ్యూటీ ప్రియాంక మోహన్ నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ మెయిన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. అర్జున్ దాస్, శ్రేయా రెడ్డి, ప్రకాష్ రాజ్ తదితరులు మరో కీలక పాత్రల్లో నటించారు. ఇందులో పవన్ ఓజస్ గంభీర అనే పాత్రలో కనిపించబోతున్నారు. హరిహర వీరమల్లు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో పవన్ ఫ్యాన్స్ ఆశలన్నీ  'ఓజీ' పైనే పెట్టుకున్నారు. 'ఓజీ'లో  గ్యాంగ్ స్టార్ గా పవన్ పాత్ర ఎలా ఉండబోతుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

అఖీరా క్యామియో రోల్.. 

'ఓజీ' లో పవన్ కళ్యాణ్ కుమారుడు అఖీరా నందన్ క్యామియో రోల్లో కనిపించబోతున్నాడనే వార్త సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. పవన్ చిన్నప్పటి రోల్లో అఖీరా కనిపించనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. కానీ, ఇప్పటివరకు దీనికి సంబంధించి చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ అఖీరా క్యామియో నిజమైతే పవన్ డబుల్ ధమాకా అనే చెప్పొచ్చు. 

ఇదిలా ఉంటే ప్రస్తుతం 'ఉస్తాద్ భగత్ సింగ్' చివరి షెడ్యూల్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మేకర్స్ నిర్మిస్తోంది. పవన్ ఫ్యాన్స్ కి కావాల్సిన మాస్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో పుష్కలంగా ఉండబోతున్నట్లు టాక్. 'గబ్బర్ సింగ్' తర్వాత హరీష్- పవన్ కాంబోలో రానున్న ఈసినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.  

Advertisment
తాజా కథనాలు