Pawan Kalyan OG: ప్రతీ 12 ఏళ్లకు ఓ సెన్సేషన్! పవన్ సినిమాల్లో ఇది గమనించారా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత విడుదలైన రెండవ సినిమా 'ఓజీ'. మొదటి సినిమా హరిహర వీరమల్లు అభిమానులను ఘోరంగా నిరాశపరిచింది.

New Update
PAWAN KALYAN OG

PAWAN KALYAN OG

Pawan Kalyan OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత విడుదలైన రెండవ సినిమా 'ఓజీ'. మొదటి సినిమా హరిహర వీరమల్లు అభిమానులను ఘోరంగా నిరాశపరిచింది. దీంతో 'ఓజీ' పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. భారీ అంచనాలు నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ఇప్పటికే ప్రీమియర్ షోలు, మార్నింగ్ షోలు పూర్వగా  నుంచే సూపర్ రెస్పాన్స్  సొంతం చేసుకుంటోంది. పవన్ ఫ్యాన్స్ అరుపులు, కేకలతో థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. సినిమాలో పవర్ స్టార్ అభిమానులకు కావాల్సిన మాస్ ఎలిమెంట్స్, హై మూమెంట్స్ పుష్కలంగా ఉన్నాయని ఫ్యాన్స్ చెబుతున్నారు. పుష్కర కాలం తర్వాత పవన్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే సినిమా తీసుకొచ్చాడంటూ సుజీత్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు ఫాన్స్. 

12 ఏళ్లకు హిట్ 

ప్రతీ పన్నెండు  సంవత్సరాలకు ఒకసారి పుష్కర పండగ  వచ్చినట్లు.. పవన్ కళ్యాణ్ సినీ prayanamlo కూడా పరిశీలిస్తే.. ప్రతీ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఆయన కెరీర్ లో మైలురాయిలా నిలిచిపోయే, అభిమానులను ఉర్రూతలూగించే ఒక అద్భుతమైన సినిమా వస్తోంది.

2001లో 'ఖుషీ' 

2001 లో 'ఖుషీ'  సినిమాతో ఇండస్ట్రీలో సంచలనం సృష్టించారు పవన్. అప్పట్లో ఈ సినిమా ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేసింది. ఎస్. జె. సూర్య స్టైలిష్ మేకింగ్, కథ చెప్పే విధానం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా హీరోహీరోయిన్ల మధ్య సన్నివేశాలు, కెమిస్ట్రీ కూడా ఫ్రెష్ ఫీలింగ్ కలిగించాయి.  101 కేంద్రాలలో 50 రోజులు, 79 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శితమై రికార్డు సృష్టించింది. యువతలో పవన్ ఫాలోయింగ్ మరింత పెంచేసింది.

 2013లో 'అత్తారింటికి దారేది'

ఆ తర్వాత 2013లో త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన  'అత్తారింటికి దారేది' బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఆ ఏడాది సౌత్  ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇందులో పవన్ కామెడీ టైమింగ్, యాక్షన్,  ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. 

2025లో 'ఓజీ '

'అత్తారింటికి దారేది' తర్వాత మళ్ళీ 12 ఏళ్లకు  'ఓజీ 'తో ఆ రేంజ్ హిట్ కొట్టారు పవన్. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ నేడు థియేటర్స్ లో విడుదలైంది. విడుదలకు ముందు నుంచే అంచనాలను పెంచిన..' ఓజీ' అంచనాలకు తగ్గట్లే బాక్సాఫీస్ వద్ద రఫ్ఫాడిస్తోంది. ప్రీమియర్ షోల నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. పవన్ కళ్యాణ్ స్టైల్, యాక్షన్ పవర్‌ను నెక్స్ట్ లెవెల్లో చూపించాడు డైరెక్టర్ సుజీత్. ఆయన మాస్ అప్పీల్‌, స్వాగ్‌, మరియు స్క్రీన్ ప్రెజెన్స్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్కిస్తున్నాయి.  ముంబై నేపథ్యంలో ఒక రొటీన్ గ్యాంగ్ స్టార్ డ్రామా అయినప్పటికీ.. సుజీత్ ప్రజెంటేషన్, మేకింగ్ ఆకట్టుకున్నాయి.  పుష్కర కాలం తర్వాత పవన్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే సినిమా తీసుకొచ్చాడంటూ సుజీత్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు ఫాన్స్. 

Also Read: OG MOVIE: రూ. 20 లక్షలు బొక్క ... ఓజీ' ప్రీమియర్ షోలో కత్తితో స్క్రీన్ చింపేసిన ఫ్యాన్స్ (వీడియో వైరల్)

Advertisment
తాజా కథనాలు