/rtv/media/media_files/2025/09/20/mohanlal-2025-09-20-21-07-23.jpg)
mohanlal
Mohan Lal: ఆరు జాతీయ అవార్డులు, పద్మ శ్రీ, పద్మ విభూషణ్, తొమ్మిది కేరళ స్టేట్ అవార్డులు అందుకున్న మలయాళ స్టార్ మోహన్ లాల్ ఇప్పుడు మరో అత్యున్నతమైన పురస్కారాన్ని అందుకున్నారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన కృషికి, ఆయన బహుముఖ నైపుణ్యానికి గానూ భారత ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించింది. ఈ సందర్భంగా మోహన్ లాల్ సినీ ప్రస్థానానికి సంబంధించి చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికర విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..
25 ఏళ్ల తర్వాత విడుదల
ఊరికే ఎవరూ, సూపర్ స్టార్లు, స్టార్ హీరోలు అయిపోరు. సాధించాలనే కృషి, పట్టుదల, తపన ఉంటేనే జీవితంలో సక్సెస్ వస్తుంది. సక్సెస్ తో పాటు స్టార్ డమ్ కూడా వరిస్తుంది. నటుడు మోహన్ లాల్ సినీ జీవితం కూడా పూల పాన్పులా లేదు. ఆయన మొదటి సినిమా షూట్ చేసిన 25 సంవత్సరాలకు థియేటర్స్ లో విడుదలైంది. అయితే, సెన్సార్‌షిప్ సమస్యల వల్ల ఈ సినిమా దాదాపు 25 సంవత్సరాల తర్వాత, అంటే 2003లో విడుదలైంది.
విలన్‌గా కెరీర్ మొదలు
మొదటి సారి మోహన్ లాల్ వెండితెరపై కనిపించిన సినిమా 'మంజిల్ విరింజ పూక్కళ్'. ఇది 1980 లో థియేటర్స్ లో విడుదలైంది. అయితే ఇందులో మోహన్ లాల్ విలన్ పాత్రలో నటించారు. విలన్ గా ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి.
ఒకే ఏడాదిలో 36 సినిమాలు
సాధారణంగా ఒక ఏడాదిలో ఒక హీరో రెండు లేదా మూడు.. మరీ ఎక్కువ బిజీ అయితే నాలుగు సినిమాలు చేయడం సహజం. కానీ మోహన్ లాల్ మాత్రం ఏకంగా 36 సినిమాల్లో నటించి అప్పట్లో ఒక రికార్డు సృష్టించారు. నటించడం మాత్రమే కాదు అందులో 24 సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాయి. 1986లో మోహన్ లాల్ ఈ రికార్డు క్రియేట్ చేశారు.
నిర్మాతగా
నటుడిగా మాత్రమే కాదు నిర్మాణ రంగంలో కూడా సత్తాచాటారు మోహన్ లాల్. ఆయన సొంత నిర్మాణ సంస్థ 'ప్రణవం ఆర్ట్స్'లో పలు సినిమాలు నిర్మించారు. నటన, నిర్మాణంతో పాటు మోహన్ లాల్ మంచి గాయకుడు కూడా.. 25కి పైగా పాటలు పాడారు.
రెజ్లర్‌గా కెరీర్
మోహన్ లాల్ కేవలం నటుడు మాత్రమే కాదు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. నటనకు ముందు మోహన్ లాల్ ఒక ప్రొఫెషనల్ రెజ్లర్! 1977- 78 సంవత్సరంలో కేరళ స్టేట్ రెజ్లింగ్ ఛాంపియన్ గా నిలిచారు. అంతేకాదు నేషనల్ లెవెల్ పోటీల్లో కూడా ప్రాతినిధ్యం వహించడానికి ఎంపికయ్యారు. అయితే ఆ సమయంలోనే సినిమా ఆఫర్లు రావడంతో ఆయన దారి ఇండస్ట్రీ వైపుకు మళ్లిందని సమాచారం.
బ్లాక్ బెల్ట్
నటుడు మోహన్ లాల్ మార్షల్ ఆర్ట్స్ లో కూడా ప్రావీణ్యం పొందారు. 2012లోదక్షిణ కొరియాలో జరిగిన 'వరల్డ్ తైక్వాండో హెడ్‌క్వార్టర్స్' పోటీల్లో బ్లాక్ బెల్ట్ అందుకున్నారు. సౌత్ ఇండస్ట్రీలో బ్లాక్ బెల్ట్ సాధించిన తొలి నటుడు మోహన్ లాల్.
తెలుగులో పాత్రలు
మలయాళంతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ మోహన్ లాల్ కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. దీనికి ముందు 1994 లో బాలయ్య 'గాండీవం' సినిమాలో కూడా అతిథి పాత్రలో కనిపించారు.
లెఫ్టినెంట్ కల్నల్
మోహన్ లాల్ 2009లో ప్రభుత్వం చేత భారత సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్ బాధ్యతలు స్వీకరించారు. లెఫ్టినెంట్ కల్నల్ హోదా పొందిన మొదటి నటుడు మోహన్ లాల్.
Also Read: OG: పవన్ ఫ్యాన్స్ కు పూనకాలే .. ' ఓజీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ వివరాలు చూస్తే షాక్!