'మ్యాడ్ స్క్వేర్' ఫస్ట్ సింగిల్.. లడ్డు గాని పెళ్లి పాట అదిరిందిగా

'మ్యాడ్‌ స్క్వేర్‌' మూవీ నుంచి నేడు ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. 'లడ్డు గాని పెళ్లి' అంటూ సాగే ఈ సాంగ్ ఫుల్ సెలెబ్రేషన్ మోడ్ లో సాగడంతో ఈ పాట ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను భీమ్స్ సిసిరోలియో, మంగ్లీ పాడారు.

New Update

Mad Square Movie: గత ఏడాది టాలీవుడ్ లో యూత్ ను బాగా ఆకట్టుకున్న సినిమాలో 'మ్యాడ్' ముందు వరుసలో ఉంటుంది. సితార ఎంటర్టైన్ మెంట్స్ లాంటి టాప్ బ్యానర్ నుంచి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఎన్టీఆర్‌ బావమరిది నార్నే నితిన్, సంతోష్‌ శోభన్‌ తమ్ముడు సంగీత్ శోభన్, గౌరీ ప్రియా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను డెబ్యూ డైరెక్టర్ ఉదయ్ శంకర్ తెరకెక్కించారు.

సెలెబ్రేషన్ మోడ్ ఆన్..

ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ వస్తోంది. 'మ్యాడ్‌ స్క్వేర్‌' పేరుతో రానున్న ఈ మూవీ నుంచి నేడు ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. 'లడ్డు గాని పెళ్లి' అంటూ సాగే ఈ సాంగ్ ఫుల్ సెలెబ్రేషన్ మోడ్ లో సాగడంతో ఈ పాట ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.  కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను భీమ్స్ సిసిరోలియో, మంగ్లీ పాడారు. భీమ్స్ సిసిరోలియో కంపోజ్‌ చేసిన ఈ పాటతో థియేటర్లు దద్దరిల్లిపోవడం పక్కా అని అర్థమవుతోంది.

Also Read :  ప్రశాంత్ నీల్ మూవీపై అప్డేట్ ఇచ్చిన ఎన్టీఆర్..

మొత్తానికి మొదటి పాటతోనే మేకర్స్‌ సినిమాపై క్యూరియాసిటీ పెంచేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని నాగవంశీ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫార్చూన్‌ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై హారికా సూర్యదేవర, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అక్టోబర్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

 

Advertisment
తాజా కథనాలు