HariHara Veeramallu: ఇంటర్వెల్ ట్విస్ట్ .. 'వీరమల్లు' లో అల్లు అర్జున్ మాస్ ఎంట్రీ ?

'హరిహర వీరమల్లు' లో ఇంటర్వెల్ సీక్వెన్స్ లో  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎంట్రీ అదిరిపోయిందని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఇంటర్వెల్ సీన్ కు ముందు బన్నీ ఎంట్రీ మాస్ లెవెల్ లో ఉందని, 'మాట వినుర' పాటకు ముందు ఆయన కనిపించడంతో షాక్ అయ్యామని చెబుతున్నారు.

New Update

HariHara Veeramallu: నాలుగేళ్ళ పవన్ ఫ్యాన్స్ నిరీక్షణకు ఈరోజు తెరపడింది. 'హరిహర వీరమల్లు' థియేటర్స్ లో సందడి చేస్తోంది. రాత్రి నుంచే తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల ప్రీమియర్ షోలు పడగా ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. సినిమాలో పవన్ యాక్షన్, డైలాగ్స్ పిచ్చెక్కించాయని చెబుతున్నారు. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే అదిరిపోయిందని అంటున్నారు. 

అల్లు అర్జున్ ఎంట్రీ!

ఇంటర్వెల్ సీక్వెన్స్ లో  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎంట్రీ అదిరిపోయిందని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఇంటర్వెల్ సీన్ కు ముందు బన్నీ ఎంట్రీ మాస్ లెవెల్ లో ఉందని, 'మాట వినుర' పాటకు ముందు ఆయన కనిపించడంతో షాక్ అయ్యామని చెబుతున్నారు. బాలకృష్ణ ఉంటాడేమో అని అనుకున్నాం, కానీ బన్నీని చూసి ఆశ్చర్యపోయామంటున్నారు ఫ్యాన్స్. సినిమాలో ఈ ట్విస్ట్ పవన్ ఫ్యాన్స్ లో మరింత జోష్ పెంచినట్లు తెలుస్తోంది. 

#Pawan Kalyan #Allu Arjun #Harihara veeramallu #Harihara veeramallu reviews
Advertisment
తాజా కథనాలు