Humaira Asghar Ali: ఘోరం.. తొమ్మిది నెలలుగా కుళ్లిపోయిన హీరోయిన్ డెడ్ బాడీ!

పాకిస్థాన్ నటి హుమైరా అస్ఘర్ అలీ మృతదేహం ఆమె అపార్ట్‌మెంట్‌లో కుళ్లిపోయిన స్థితిలో లభ్యమైంది. ఆమె కొంతకాలంగా అద్దె చెల్లించకపోవడంతో యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఎంక్వైరీ కోసం అపార్ట్మెంట్ కి వెళ్లగా.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

New Update
Humaira Asghar Ali found dead in flat

Humaira Asghar Ali found dead in flat

Humaira Asghar Ali: పాకిస్థానీ నటి, మోడల్ హుమైరా అస్ఘర్ అలీ కరాచీలోని తన అపార్ట్మెంట్ లో కుళ్ళిన స్థితిలో మృతదేహమై కనిపించింది.ఈ ఘటన ఆమె అభిమానులను, సినీ నటులను షాక్ కి గురిచేసింది. ముందుగా ఆమె రెండు వారల క్రితం చనిపోయిందని అంచనా వేశారు. కానీ, పోస్ట్ మార్టం తర్వాత ఆమె తొమ్మిది నెలల క్రితమే చనిపోయి ఉండవచ్చని నిర్దారణకు వచ్చారు.  డాక్టర్ సమ్మయ్యా సయ్యద్ హుమైరా శరీరం పూర్తిగా కుళ్లిపోయిందని తెలిపారు. 

దీంతో పాటు ఆమె కాల్ డేట్ పరిశీలించగా.. చివరి ఫోన్ కాల్ 2024 అక్టోబర్ లో చేసినట్లు తెలిసింది. అలాగే  పక్కింటి వాళ్లకు ఆమెను చివరిగా సెప్టెంబర్ లో చూసినట్లు తెలిపారు. ఈ ఆధారాలన్నీ కూడా  హుమైరా  గతేడాది అక్టోబర్ లోనే  చనిపోయి ఉండవచ్చని సూచిస్తున్నాయి. 

ఎలా బయటపడింది?

అయితే  హుమైరా కొంతకాలంగా ఇంటి అద్దెను చెల్లించకపోవడంతో యజమాని ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఎంక్వైరీ కోసం ఆమె అపార్ట్మెంట్ కి వెళ్లగా.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తొమ్మిది నెలలుగా ఆమె  చనిపోయి ఉన్నా..  ఎవరూ గుర్తించలేకపోవడంతో స్థానికులు, పోలీసులు ఆశ్చర్యపోయారు. కుళ్ళిన స్థితిలో శవాన్ని చూసి అంతా షాక్ కి గురయ్యారు. అలాగే  ఇంట్లో  తుప్పు పట్టిన జాడీలు, ఆరు నెలల కంటే ఎక్కువ కాలం నుంచి కుళ్ళిన  ఆహార పదార్థాలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.  బిల్లులు పెండింగ్ ఉండడంతో 2024 అక్టోబర్ నుంచే  ఆమె ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు గుర్తించారు. 

మృతదేహాన్ని నిరాకరించిన కుటుంబం 

ముందుగా హుమైరా మృతదేహాన్ని స్వీకరించడానికి ఆమె  నిరాకరించారట. కానీ, ఆ తర్వాత ఆమె తమ్ముడు నవీద్ అస్ఘర్ మృతదేహన్నీ స్వాధీనం చేసుకోవడానికి కరాచీ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే  డెడ్ బాడీ బాగా  కుళ్లిపోయిన స్థితిలో ఉండడంతో గుర్తించడానికి వీలు కాలేదు. దీంతో ధ్రువీకరణ కోసం DNA పరీక్ష నిర్వహించారు.  అనంతరం మృతదేహాన్ని ఆమె తమ్ముడికి అప్పగించారు. 

ఏడేళ్ల క్రితమే ఇంటికి దూరం!

ఈ మేరకు హుమైరా నవీద్ మాట్లాడుతూ.. హుమైరా సుమారు ఏడేళ్ల క్రితం లాహోర్ నుంచి కరాచీకి వచ్చిందని తెలిపాడు.  అప్పటి నుంచి కుటుంబానికి దూరంగా ఉందని, అప్పుడప్పుడు మాత్రమే అమ్మానాన్నలను చూడడానికి వచ్చేదని చెప్పాడు. ఈ మధ్య దాదాపు ఏడాదిన్నరగా ఇంటికి రాలేదని.. చివరిగా ఇలా జరిగిందని తెలిపాడు. 

సినిమాలు

లాహోర్‌కు చెందిన హుమైరా అస్ఘర్ అలీ 2015లో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.  'జస్ట్ మ్యారీడ్', 'ఎహసాన్ ఫరామోష్', 'గురు', 'చల్ దిల్ మేరే' వంటి టీవీ షోలలో సహాయక పాత్రల్లో కనిపించి మెప్పించింది. ఆ తర్వాత సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంది. 'జలైబీ',  'లవ్ వ్యాక్సిన్' సినిమాలు చేసింది. 

Also Read: Naga Babu Re Entry: 12 ఏళ్ల త‌ర్వాత నాగబాబు గ్రాండ్ రీ ఎంట్రీ.. 'జబర్దస్త్' ప్రోమో చూశారా

Advertisment
తాజా కథనాలు