/rtv/media/media_files/2025/08/11/bigg-boss-19-hindi-2025-08-11-13-51-43.jpg)
BIGG BOSS 19 HINDI
BIGG BOSS: బుల్లితెరపై బిగ్ బాస్ జాతర మొదలైంది. దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో ప్రసారం అవుతున్న ఈ షో.. మరో కొత్త సీజన్ తో సిద్ధమవుతోంది. ఇప్పటికే తెలుగు, హిందీ భాషల్లో కొత్త సీజన్ కి సంబంధించిన ప్రోమోలు విడుదలయ్యాయి. ప్రస్తుతం తెలుగులో సీజన్ 9 రాబోతుండగా.. హిందీలో సీజన్ 19 రాబోతుంది. ఈ క్రమంలో హిందీ బిగ్ బాస్ కంటెస్టెంట్లకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్ అవుతోంది.
బిగ్ బాస్ 19 లోకి హిమన్షి
పహల్గామ్ ఉగ్రదాడిలో మృతి చెందిన ఇండియన్ నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ భార్య హిమన్షి నర్వాల్ సీజన్ 19లో కంటెస్టెంట్ గా పాల్గొనబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే బిగ్ బాస్ నిర్వాహకులు ఈసారి ప్రేక్షకులకు త్వరగా కనెక్ట్ అయ్యే కొంతమందిని తీసుకురావాలని అనుకుంటున్నారట. ఈ నేపథ్యంలో హిమన్షి నర్వాల్ ని సంప్రదించే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. దీని గురించి హిమన్షి లేదా బిగ్ బాస్ నిర్వహకుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. పెళ్ళైన రెండు నెలలకే ఉగ్రదాడిలో భర్తను కోల్పోయిన హిమన్షి కన్నీటి కథ ఎంతో మందిని కదిలించింది.
2025 ఏప్రిల్లో కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి దేశం మొత్తాన్ని కలచివేసింది. ఈ దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా.. అందులో హిమన్షి భర్త వినయ్ నర్వాల్ కూడా ఉన్నారు. హనీమూన్ కోసమని వెళ్లిన ఈ దంపతులు కథ ఉగ్రదాడితో విషాదంగా ముగిసింది. ఈ దాడి తర్వాత, తన భర్త వినయ్ మృతదేహం పక్కన కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటున్న హిమాన్షి ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలు చూసి చాలామంది భారతీయులు ఎమోషనల్ అయ్యారు.