OTT Movies: ఓటీటీ ప్రియుల వినోదాన్ని డబుల్ చేసేందుకు ఈ వారం మరికొన్ని కొత్త సినిమాలు, సీరీస్ లతో ఓటీటీలో విడుదలయాయ్యి. కామెడీ, థ్రిల్లర్, క్రైమ్ ఇలా రకరకాల జానర్లతో కూడిన సినిమాలతో ఓటీటీ వినోదాల విందుకు సిద్ధమైంది. ఈ వారం ఓటీటీ సినిమాలు, సీరీస్ ల లిస్ట్ ఏంటో ఇక్కడ చూద్దాం..
ఓటీటీ సినిమాలు
స్క్విడ్ గేమ్ 3
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పాపులర్ కొరియన్ సీరీస్ 'స్క్విడ్ గేమ్ 3' జూన్ 27న ఓటీటీలో విడుదలైంది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. చివరి గేమ్ మరింత ఉత్కంఠగా, ఊహించని మలుపులతో ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్థమైంది.
పంచాయత్ సీజన్ 4
గ్రామీణ రాజకీయాలు, మానవ సంబంధాలు, హాస్యంతో కూడిన ఈ సిరీస్‌కు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఈ సీజన్‌లో ఎన్నికలు సరికొత్త డ్రామాతో, రక్తి కట్టించే సన్నివేశాలతో ఉంటాయని టాక్. ఇది ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
రైడ్ 2
అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'రైడ్' సీక్వెల్ 'రైడ్ 2' జూన్ 26 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
విరాటపాలెం
యంగ్ టాలెంట్ అభిజ్ఞ లీడ్ రోల్లో నటించిన ఈ చిత్రం జీ 5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒక గ్రామంలో జరిగే వింత మరణాలను దర్యాప్తు చేసే ఒక పోలీస్ అధికారిణి కథ ఇది. మిస్టరీ, సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ తో మూవీ ట్రైలర్ ఆకట్టుకుంది.
ఒక పథకం ప్రకారం
పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరాం, సముద్రఖని ప్రధాన పాత్రలో నటించిన 'ఒక పథకం ప్రకారం' సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒక న్యాయవాది భార్య కనిపించకుండా పోవడం, ఆ తర్వాత జరిగే సంఘటనల చుట్టూ తిరిగే థ్రిల్లర్ కథ ఇది.
వెర్డిక్ట్
సుహాసిని, వరలక్ష్మీ శరత్ కుమార్, ప్రధాన పాత్రలో నటించిన వెర్డిక్ట్ సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కోర్టు రూమ్ డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం మే 30న థియేటర్స్ లో విడుదలైంది.