OG New Song: ఓజీ నుంచి ‘కిస్ కిస్’ న్యూ సాంగ్ చూశారా? మైండ్ బ్లోయింగ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన 'ఓజీ' స్పెషల్ సాంగ్ వచ్చేసింది. నేహా శెట్టి స్టెప్పులతో కూడిన ఈ ఐటెం సాంగ్ ప్రస్తుతం ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. సినిమా విడుదలైన తొలి వారంలో ఈ పాట లేకపోవడంతో ఫ్యాన్స్ కొంత నిరాశ చెందారు.

New Update

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుజీత్ కాంబినేషన్‌లో ‘ఓజీ’ (They Call Him OG)  సెప్టెంబర్ 25న రిలీజై భారీ రెస్పాన్స్‌ను అందుకుంది. మొదటి నుంచి ఎన్నో అంచనాలను క్రియేట్ చేసిన ఈ చిత్రం.. సినీ ప్రియులను, అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా సుజీత్ డైరెక్షన్‌లో పవన్‌కి ఇచ్చిన ఎలివేషన్స్ మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. పవన్ ఫ్యాన్స్ ఎలాగైతే తమ హీరోని చూడాలనుకున్నారో.. అలాంటి లుక్, స్టైల్, ఎలివేషన్స్‌తో చూపించి అభిమానులను మంత్రముగ్దులను చేశాడు. 

Kiss Kiss Bang Bang

ఇందులోలోని సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌‌ సినిమాకు ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. థమన్ తన ఆర్ఆర్‌తో విధ్వంసం సృష్టించాడు. అయితే ఇంతటి బడా హీరో సినిమాలో ఐటెం సాంగ్‌ లేకపోవడంతో అభిమానులు ఒకింత నిరాశ చెందారు. ఐటెం సాంగ్‌ను చిత్రీకరించినా దానిని సినిమాలో పెట్టకపోవడంతో చాలా బాధపడ్డారు. ఇక ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన స్పెషల్ సాంగ్ చివరికి వచ్చేసింది. హీరోయిన్ నేహా శెట్టి స్టెప్పులతో కూడిన ‘కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్’ అనే ఈ ఐటెం సాంగ్‌ను తాజాగా విడుదల చేశారు.

సినిమా విడుదలైన తొలి రోజు థియేటర్ల వెర్షన్‌లో నేహా శెట్టి చేసిన ఈ స్పెషల్ సాంగ్ లేదు. స్టోరీ వేగాన్ని దృష్టిలో ఉంచుకుని, రన్ టైమ్ పెరగకుండా ఉండేందుకు ఈ పాటను ఫైనల్ కట్ నుంచి తొలగించినట్లు అప్పట్లో వార్తలు జోరుగా సాగాయి. దీనిపై పవన్ కల్యాణ్ అభిమానులు కొంత నిరాశ చెందారు. అయితే అభిమానుల డిమాండ్‌ మేరకు.. నిర్మాత డీవీవీ దానయ్య ఆధ్వర్యంలోని నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ పాటను రెండో వారం నుంచి థియేటర్లలో అదనంగా చేర్చింది. సినిమాలోని కీలక సన్నివేశంలో, ముంబైకి విలన్ ఇమ్రాన్ హష్మీ వచ్చే సందర్భంలో ఈ పాటను యాడ్ చేశారు.

థియేటర్లలో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఈ 'కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్' సాంగ్‌ వీడియోను తాజాగా చిత్ర బృందం యూట్యూబ్‌లో విడుదల చేసింది. ఈ పాటలో నేహా శెట్టి డ్యాన్స్, గ్లామర్‌తో అలరించింది. థియేటర్‌లో మిస్ అయిన పవన్ కల్యాణ్ ఫ్యాన్స్, ఇప్పుడు యూట్యూబ్‌లో ఈ స్పెషల్ సాంగ్‌ను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పాట సినిమాకు మరింత 'ఫ్రెష్ కిక్' ఇచ్చిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Advertisment
తాజా కథనాలు