OG Movie: పవన్ ఫ్యాన్స్ కి పూనకాలే.. 'గన్స్‌ అండ్‌ రోజెస్‌' పాట వచ్చేసింది!

పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్  'ఓజీ' సెప్టెంబర్ 25న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ నుంచి మూడవ పాటను విడుదల చేశారు. 'గన్స్‌ అండ్‌ రోజెస్‌' టైటిల్ తో విడుదల చేసిన ఈ పాట పవన్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తోంది.

New Update

OG Movie:  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్  'ఓజీ' సెప్టెంబర్ 25న థియేటర్స్ లో విడుదల కానుంది. రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ షురూ చేసింది చిత్రబృందం. ఈమేరకు తాజాగా మూవీ మరో సాంగ్ విడుదల చేసింది. 'గన్స్‌ అండ్‌ రోజెస్‌' టైటిల్ తో విడుదల చేసిన ఈ పాట పవన్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తోంది. పాటలోని  రిథమ్స్ , తమన్ పవర్ ఫుల్  బీట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ర్యాప్ స్టైల్లో  ఆంగ్లం, తెలుగు పదాలతో కలిపిన లిరిక్స్ రిఫ్రెషింగ్ గా కొత్తగా ఉన్నాయి.  "Guns N’ Roses" పాట సినిమాలోని కథాంశానికి అనుగుణంగా సాగుతుంది. గ్యాంగ్ స్టార్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో పవన్ యాక్షన్ సైడ్ తో పాటు రొమాంటిక్ యాంగిల్ కూడా చూపించారు డైరెక్టర్. అందుకే "Guns N’ Roses" పేరుతో పాటను విడుదల చేసినట్లు  అర్థమవుతోంది.  తమన్ సంగీతం అందించిన ఈ పాటను సింగర్ హర్ష ఆలపించారు. అద్వితీయ లిరిక్స్ రాశారు. 

మ్యూజిక్ హైలైట్ 

ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతీ పాట సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. Firestorm, సువ్వి.. సువ్వి, ఇప్పుడు గన్స్ అండ్ రోజెస్ అన్నీ పాటలు కూడా విడుదలైన గంటల్లోనే మిలియన్ల వ్యూస్ సాధించాయి. ఇతర సినిమాల కంటే 'ఓజీ' మ్యూజిక్ కాస్త  బిన్నంగా ఉండబోతుందని తెలుస్తోంది. అంతేకాదు  ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చాలా కష్టపడుతున్నారు. ఆడియన్స్ కి ఒక కొత్త అనుభవాన్ని అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. బీజీఎం కోసం జపాన్ సాంప్రదాయ వాద్య పరికరం కోటాను కూడా ఉపయోగించారట. ఇది సినిమాకు ఒక ప్రత్యేకమైన ఫీల్ ఇస్తుందని చెబుతున్నారు.  ఇటీవలే తమన్ ఒక ఓజీ బీజీఎం కి సంబంధించి ఒక జాపనీస్ బీట్ వినిపించగా.. సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అయ్యింది.  లండన్ లోని ఓ ప్రముఖ స్టూడియోలో  'ఓజీ'  మ్యూజిక్ రికార్డింగ్స్ జరుగుతున్నాయి. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 117 మంది సంగీత  కళాకారులు ఈ సినిమా మ్యూజిక్ కోసం పనిచేస్తున్నారు. 

ప్రభాస్  'సాహో' ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటించగా.. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో కనిపించనున్నారు.  అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య దీనిని నిర్మించారు. 'హరిహర వీరమల్లు' డిజాస్టర్ తర్వాత పవన్ ఫ్యాన్స్ ఆశలన్నీ  'ఓజీ' పైనే పెట్టుకున్నారు.  

Also Read: Dhanush Son: ఫస్ట్ టైమ్.. కొడుకుతో కలిసి దుమ్మురేపిన ధనుష్.. డాన్స్ వీడియో వైరల్!

Advertisment
తాజా కథనాలు