/rtv/media/media_files/2025/07/22/war-2-trailer-releasing-on-july-25th-2025-07-22-13-37-28.jpg)
War 2 Trailer releasing on july 25th
NTR WAR 2: RRR సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న ఎన్టీఆర్.. ఇప్పుడు 'వార్ 2' తో బాలీవుడ్ లో అడుగుపెడుతూ సరికొత్త రికార్డులు సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ తో సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇందులో ఎన్టీఆర్- హృతిక్ మధ్య యాక్షన్ సన్నివేశాలు ఫ్యాన్స్ కి కిక్కెకించేలా ఉన్నాయి. హృతిక్- ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు.
బాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేష్
అయితే ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్, నటీనటుల రెమ్యునరేషన్ వివరాలు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఎన్టీఆర్ బాలీవుడ్ లో తన తొలి సినిమాకే భారీ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది. తాజా నివేదికల ప్రకారం.. 'వార్ 2' సినిమాలో నటించినందుకు ఎన్టీఆర్ రూ. 60 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సినీ వర్గాల్లో టాక్. ఇది బాలీవుడ్ లో అరంగేట్రం చేస్తున్న ఒక నటుడికి ఇప్పటివరకు ఇచ్చిన అత్యధిక రెమ్యునరేష్ అని చెబుతున్నారు. అయితే ఎన్టీఆర్ పాన్ ఇండియా అప్పీల్ కారణంగా ఈ భారీ రెమ్యునరేషన్ చెల్లించేందుకు వెనకాడలేదట చిత్రబృందం.
Remuneration of #WAR2 Cast;
— Srëêkanth Rêddy🐯 (@Sreekant777) July 26, 2025
NTR - 60Cr 💥💥
Hrithik Roshan - 48Cr
Kiara Advani - 15Cr
Ayan Mukerji - 32Cr
With NTR emerging as the highest-paid actor in the film.
His Bollywood debut is smashing. 🔥🔥
Well the Trade knows and so does @yrf. 👍🏻 pic.twitter.com/PMMu3mcPT8
ఇక హృతిక్ విషయానికి వస్తే.. రూ. 48 కోట్ల రెమ్యునరేషన్ తో పాటు, సినిమా లాభాల్లో వాటాను కూడా తీసుకోబోతున్నట్లు సమాచారం. ఒకవేళ సినిమా బ్లాక్ బస్టర్ అయితే, హృతిక్ మొత్తం పారితోషికం రూ. 100 కోట్లకు పైనే ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ పేమెంట్ హృతిక్ ఫిక్స్డ్ పేమెంట్ కంటే ఎక్కువగా ఉండటం విశేషం.
Also Read: Actress: పెళ్లి కాకుండానే కవలలకు తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్! బేబీ బంప్ ఫొటోలు వైరల్