/rtv/media/media_files/2025/07/28/bhavana-ramanna-2025-07-28-17-24-51.jpg)
Bhavana Ramanna
Actress: 40 వయసులో పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది కన్నడ నటి భావన రామన్న! అది కూడా కవలలకు జన్మనివ్వబోతున్నట్లు తెలిపింది. ప్రస్తుతం తాను ఆరు నెలల గర్భవతినని చెబుతూ బేబీ బంప్ ఫొటోలు షేర్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆమె IVF పద్ధతి ద్వారా కవలలకు జన్మనివ్వబోతున్నారు.
Also Read: singer Madhupriya: సింగర్ మధుప్రియ ఇంట పెళ్లి సందడి.. ఫొటోలు వైరల్!
నటి పోస్ట్
భావన రమ్మన్న తన ఇన్ స్టాగ్రామ్ లో ఇలా రాసుకొచ్చారు.. ''20 ఏళ్ల వయసులో, 30 ఏళ్ల వయసులో తల్లి కావాలనే ఆలోచన నా మైండ్ లో లేదు. ఆ తర్వాత 40 ఏళ్లు వచ్చేసరికి ఆ కోరిక బలంగా కలిగింది. కానీ ఒక అవివాహితగా తల్లి కావాలనుకున్నప్పుడు అనేక సవాళ్లు ఎదురవుతాయనే విషయం తెలిసిందే. అలాగే నాకు కూడా మొదట్లో చాలా ఇబ్బందులు వచ్చాయి! చాలా IVF క్లినిలు నేను సింగిల్ అని చికిత్స అందించడానికి నిరాకరించాయి. చివరికి డాక్టర్ సుష్మ నాకు అండగా నిలిచారు. ఆమె సపోర్ట్ తో మొదటి ప్రయత్నంలోనే గర్భం దాల్చాను. ఈ విషయంలో నా కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు కూడా నాకు పూర్తి మద్దతుగా నిలిచారు'' అని తెలిపింది.
అలాగే తన పిల్లలకు తండ్రి లేకపోవచ్చు.. కానీ వాళ్ళను ప్రేమ, కళ, సంస్కృతితో నిండిన వాతావరణంలో పెంచుతానని, వారికి ఆత్మవిశ్వాసం, తమ మూలాల పట్ల గర్వం ఉండేలా చూస్తానని తెలిపారు.