/rtv/media/media_files/2025/09/29/ntr-dragon-2025-09-29-07-25-14.jpg)
NTR Dragon
NTR Dragon: యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్(Prashanth Neel) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా సినిమా డ్రాగన్ పై ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్‌లో మెజారిటీ భాగం పూర్తయింది. అక్టోబర్‌లో కొత్త షెడ్యూల్ ప్రారంభించేందుకు టీమ్ సిద్ధంగా ఉంది.
Also Read: 'లిటిల్ హార్ట్స్' ఇప్పుడు ఈ టీవీ విన్ లో.. స్పెషల్ సర్‌ప్రైజ్ కూడా!
ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన కాంతార చాప్టర్ 1 తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో డ్రాగన్ నిర్మాత రవికుమార్ చేసిన వ్యాఖ్యలు ఎన్టీఆర్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఈ వేడుకలో మాట్లాడిన ఆయన, "డ్రాగన్ తదుపరి షెడ్యూల్ అక్టోబర్‌లో మొదలవుతుంది. ఇకపై షూటింగ్‌లో ఎలాంటి గ్యాప్ లేకుండా కంటిన్యూ చేస్తాం. సినిమా రిలీజ్ డేట్‌కు తగ్గట్టుగా అన్నీ ప్లాన్ చేస్తున్నాం," అని తెలిపారు.
Also Read: పవర్ స్టార్ సంచలనం.. ఏపీ & తెలంగాణలో 'OG' రికార్డుల మోత!
అంతే కాదు, "ఈ సినిమా ఫ్యాన్స్ ఊహించనంత స్థాయిలో ఉంటుంది. ఇప్పుడే ఏమీ చెప్పలేను... ఇది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది," అంటూ ఆయన చెప్పిన మాటలు అభిమానుల్లో భారీ అంచనాలు పెంచాయి. ఎన్టీఆర్ అభిమానులు ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తిగా ఉన్నారు. ఇప్పుడు నిర్మాత మాటలతో మరింత హైప్ క్రియేట్ అయ్యింది.
Also Read: ‘కాంతార: చాప్టర్ 1’ తెలుగు ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్ గా ఆ స్టార్ హీరో..
ప్రశాంత్ నీల్ గతంలో కేజీఎఫ్ సిరీస్, సలార్ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న ఈ చిత్రం ఎలా ఉంటుందో అనే ఉత్కంఠ అందరిలో ఉంది. యాక్షన్, ఎమోషన్, మాస్ అన్నీ కలిపిన సినిమా అవుతుందని అంతా భావిస్తున్నారు.
ఈ సినిమా పూర్తిగా కొత్త కాన్సెప్ట్‌తో ఉండబోతోందని తెలుస్తోంది. డిఫరెంట్ ప్రెజెంటేషన్, హై టెక్నికల్ వేల్యూస్‌తో డ్రాగన్ భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ అభిమానులే కాకుండా, తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం పెద్ద ఎత్తున ఎదురుచూస్తున్నారు.
Follow Us