మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరెకెక్కిన 'దేవర' మూవీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. రిలీజ్ రోజు మిక్స్డ్ రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా మెల్ల మెల్లగా పాజిటివ్ టాక్ తో వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టింది. మొదటి రోజే రూ.172 కోట్లు కొల్లగొట్టిన ఈ మూవీ ఇప్ప్పటి దాకా రూ.405 కోట్ల కలెక్షన్స్ సాధించింది.
రూ.180 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ సినిమా రూ.360 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి.. వీకెండ్ పూర్తవ్వకముందే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయింది. దీంతో మూవీ టీమ్ ఇటీవల సక్సెస్ మీట్ సైతం నిర్వహించింది. ఇదిలా ఉంటే తారక్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో 'దేవర' పార్ట్-2 పై అప్డేట్ ఇచ్చాడు.
పార్ట్- 2 నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది..
దేవర రిలీజ్ కు ముందు ప్రమోషన్స్ కోసం అమెరికాకు వెళ్లిన ఎన్టీఆర్.. అక్కడ పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఇందులో భాగంగానే ఓ ఇంటర్వ్యూలో 'దేవర' పార్ట్ 2 గురించి మాట్లాడారు." దేవర రిజల్ట్ బాగుంది, పార్ట్ 2 కథ కూడా రెడీగా ఉంది, దానిలో కొన్ని మార్పులు చేయాలి.
దేవర పార్ట్ 2లో రెండు సీన్స్ కూడా షూట్ చేసాము. అన్ని వదిలేసి ఓ నెల రోజులు రెస్ట్ తీసుకో అని డైరెక్టర్ కొరటాల శివకు చెప్పాను. ఆ తర్వాత 'దేవర 2' మీద ఫోకస్ చేయమని చెప్పాను. దేవర 2 పార్ట్ 1 కంటే ఇంకా గొప్పగా ఉంటుంది.." అని చెప్పుకొచ్చాడు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.