game changer
Raa Macha Macha Song: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) - దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'గేమ్ చేంజర్' (Game Changer). ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది క్రిస్మస్ కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ 'జరగండి.. జరగండి' సాంగ్ సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకోగా.. తాజాగా మేకర్స్ సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు.
'రా.. మచ్చ మచ్చ' సాంగ్
'రా.. మచ్చ మచ్చ' అంటూ సాగిన ఈ మాస్ బీట్ లో రామ్ చరణ్ తన ఎనర్జిటిక్ స్టెప్పులతో దుమ్ములేపారు. ఈ సాంగ్ లో రామ్ చరణ్ తో పాటు ప్రియదర్శి, కమెడియన్ సత్య కూడా స్టెప్పులేస్తూ కనిపించారు. తమన్ సంగీతం అందించిన ఈ పాటను.. అనంత శ్రీరామ్ సమకూర్చారు.
సింగర్ నకాష్ అజీజ్ ఆలపించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ రామ్ చరణ్ జోడీగా నటిస్తుండగా.. అంజలి, సముద్రఖని, ఎస్ జె సూర్య, శ్రీకాంత్, సునీల్, ప్రియదర్శి, కమెడియన్ సత్య తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
#RaaMachaMacha, #DamTuDikhaja is yours now. Hope you enjoy this massive song as much as I did 🤗https://t.co/1kH2vmjXDt@shankarshanmugh @MusicThaman @DOP_Tirru @artkolla @SVC_official @ZeeStudios_ @saregamaglobal @IananthaSriram @Lyricist_Vivek #Kumaar @AzizNakash… pic.twitter.com/8whdQPxmdU
— Ram Charan (@AlwaysRamCharan) September 30, 2024