Nazriya- Fahadh Faasil: మరో స్టార్ కపుల్ విడాకులు..? వైరలవుతున్న న్యూస్

నటి నజ్రియా, ఫహద్ విడిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవలే నజ్రియా తన ఇన్ స్టాలో కొన్నిరోజులుగా మానసిక ఆరోగ్యం బాగోలేదని పోస్ట్ పెట్టడం ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తోంది. భర్తతో విడాకుల వ్యవహారం కారణంగానే ఆమె డిస్టర్బ్ అయినట్లు నెటిజన్లు భావిస్తున్నారు.

New Update
Nazriya - Fahadh divorce rumors

Nazriya - Fahadh divorce rumors

Nazriya- Fahadh Faasil: ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో విడాకులు వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. తాజాగా మరో సెలెబ్రెటీ జంట విడాకుల వార్త నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. మలయాళ నటి నజ్రియా, ఫహద్ ఫాజిల్ దంపతులు విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇటీవలే  నజ్రియా ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ ఈ పుకార్లకు తెరలేపింది. కొన్నిరోజులుగా మానసిక ఆరోగ్యం బాగోలేదని.. అందుకే సోషల్ మీడియా దూరంగా ఉంటున్నాను అంటూ ఓ సుదీర్ఘ పోస్ట్ షేర్ చేసింది నజ్రియా. అందువల్లే  'సూక్ష్మదర్శిని' విజయాన్ని కూడా ఆస్వాదించలేకపోయానని తెలిపింది. భర్తతో విడాకుల వ్యవహారం కారణంగానే ఆమె డిప్రెషన్ లోకి వెళ్లారేమో అని భావిస్తున్నారు నెటిజన్లు.   

Also Read: Jagamerigina Satyam: తెలంగాణ మట్టి వాసనను గుర్తుచేసేలా మరో సినిమా.. రవితేజ మేనల్లుడు హీరోగా!

 'బెంగళూర్ డేస్' చిత్రీకరణ సమయంలో  ఏర్పడిన  నజ్రియా- ఫహద్ పరిచయం.. కొంతకాలం తర్వాత ప్రేమగా మారింది. సంవత్సరం పాటు డేటింగ్ తర్వాత 2014లో వీరిద్దరూ కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. ఫహద్ నజ్రియా కంటే 12 ఏళ్ళ వయసులో పెద్దవారు. అయినప్పటికీ ఆమె అతడిని ఇష్టపడి ప్రేమ వివాహం చేసుకున్నారు. 

Also Read: వేసవిలో తరచుగా కడుపునొప్పి వస్తుందా?. ఇది తెలుసుకోండి 

తెలుగులో 'అంటే సుందరానికి'

ఇక నజ్రియా సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే మిస్టరీ థ్రిల్లర్ 'సూక్ష్మదర్శని' సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. థియేటర్ తో ఓటీటీలోనూ సక్సెస్ ఫుల్ రన్ కొనసాగించింది ఈ చిత్రం. కేవలం 10-15 కోట్లతో తెరక్కెక్కించగా.. రూ. 55 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. తెలుగులో నజ్రియా నాని సరసన 'అంటే సుందరానికి' సినిమాతో పరిచయమైంది. రాజా రాణి, బెంగళూర్ డేస్, Ohm Shanthi Oshaana  సినిమాలతో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. 

Also Read:America-Gunturu: టెక్సాస్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం..గుంటూరు విద్యార్థిని దుర్మరణం!

telugu-news | latest-news | cinema-news

Also Read: Health Tips: మీకు మాట్లాడుతూ భోజనం చేసే అలవాటు ఉందా?.. ఈ 5 షాకింగ్ విషయాలు తప్పక తెలుసుకోండి!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు