Nayanthara: విడాకులపై నయనతార సమాధానం ఇదే.. ఇన్ స్టాలో ఫొటో వైరల్!

నయనతార- విగ్నేష్ శివన్ కపుల్ విడాకులు తీసుకోబోతున్నారని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ పుకార్లకు ప్రతిస్పందనగా.. తాజాగా నయన్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

New Update
Nayantara clarity on divorce rumors

Nayantara clarity on divorce rumors

Nayanthara: నయనతార- విగ్నేష్ శివన్ కపుల్ విడాకులు తీసుకోబోతున్నారని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ పుకార్లకు ప్రతిస్పందనగా.. తాజాగా నయన్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.  ''మా గురించి ఏవైనా పుకార్లు చూసినప్పుడు మా రియాక్షన్ ఇదే'' అంటూ ఇద్దరూ షాకింగ్ ఈమోజీకి ఫోజిస్తూ దిగిన ఫొటోను షేర్ చేసింది. ఈ ఒక్క ఫొటోతో నయన్  తమ మధ్య ఎలాంటి సమస్యలు లేవని చెప్పకనే చెప్పింది. అలాగే తమ విడాకులపై అసత్య ప్రచారాన్ని ఖండించారు. 

Also Read: పాక్ గూఢచారి జ్యోతికి రాచమర్యాదలు...ఏకంగా ఆ రాష్ట్ర అతిథిగా....కేరళ శారీలో..

nayanthara instagram post
nayanthara instagram post

ఇటీవలే నయన్ పోస్ట్

అయితే నయనతార ఇటీవలే సోషల్ మీడియాలో వైవాహిక బంధం గురించి చేసిన ఓ పోస్ట్ విడాకుల రూమర్లకు దారితీసింది. ''తెలివి తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం పొరపాటు. అలాగే  నీ భర్త తప్పులకు నువ్వు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు'' అంటూ పోస్ట్ పెట్టింది. నయన్ ఈ పోస్ట్ పెట్టిన గంటలో కొద్దిసేపటికే డిలీట్ చేసినప్పటికీ.. ఆలోపే  స్క్రీన్ షాట్స్ తీసి వైరల్ అయ్యాయి. దీంతో వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ  నయన్ షేర్ చేసిన ఫొటోతో ఈ రూమర్లకు చెక్ పడింది. 

నయనతార- విఘ్నేష్ శివన్ 2022లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు. వీరి వివాహ వేడుకను  నెట్ ఫ్లిక్స్  డాక్యుమెంటరీ రూపంలో స్ట్రీమింగ్ కూడా చేసింది. పెళ్ళైన ఏడాదికి ఈ కపుల్ ఇద్దరు మగ కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఇటీవలే ఈ జంట తమ మూడవ వెడ్డింగ్ యానివర్సరీ కూడా జరుపుకున్నారు. 

ఇదిలా ఉంటే ప్రస్తుతం నయన్ తారా..  అనిల్ రావిపూడి- మెగాస్టార్ సినిమాలో ఫీమేల్ లీడ్ గా నటిస్తోంది. మెగాస్టార్, నయన్ కాంబోలో రాబోతున్న మూడవ సినిమా ఇది. ఇప్పటికే మొదలైన ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. 

Also Read:Mogali Rekulu: మొగలిరేకులు ఆపేయడానికి కారణం నేనే!.. అసలు విషయం బయటపెట్టిన RK నాయుడు!

Advertisment
Advertisment
తాజా కథనాలు