కోలీవుడ్ స్టార్స్ ధనుష్ - నయనతార మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. నయనతారపై నెట్‌ఫ్లిక్స్ ఒక డాక్యుమెంటరీని తీయగా.. ఈ డాక్యుమెంటరీలో తాను నటించిన నానుమ్ రౌడీ దాన్ సినిమాలో నుంచి 3 సెకన్ల వీడియోను ఈ డాక్యుమెంటరీ కోసం వాడుకుంది. అయితే ఈ 3 సెకన్ల వీడియో వాడుకోవడంపై చిత్ర నిర్మాత ధనుష్ నయనతారకు లీగల్ నోటీసులు పంపించడమే కాకుండా రూ.10 కోట్లు డిమాండ్ చేశాడు.
ఈ నేపథ్యంలోనే నయనతార ధనుష్ పై పలు ఆరోపణలు చేస్తూ బహిరంగ లేఖ విడుదల చేసింది. దీంతో ఈ ఇష్యూ అటు కోలీవుడ్ తో పాటూ ఇటు సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ విషయంలో నయనతారకు ఇండస్ట్రీలో తోటి హీరోయిన్స్ నుంచి మద్దతు లభిస్తోంది. ఇప్పటికే దీనిపై మలయాళ హీరోయిన్ పార్వతి తిరువొత్తు, అనుపమ పరమేశ్వరన్.. నయన్ కు సపోర్ట్ చేశారు.
Also Read : తనకంటే 20 ఏళ్ళు చిన్నవాడితో 'పవన్' హీరోయిన్ డేటింగ్.. అతని కౌగిలిలో ఒదిగిపోతూ
నయన్ కు పూనమ్ కౌర్ సపోర్ట్..
టాలీవుడ్ నుంచి కూడా నటి పూనం కౌర్ కూడా నయనతారకు మద్దతుగా నిలిచింది. అయితే పూనం చేసిన కామెంట్‌పై ఒక నెటిజన్ స్పందిస్తూ.. ఎందుకు అమ్మ. తన కంటెంట్‌ని అమ్ముకుని కాష్ చేసుకునే హక్కు తనకి ఉన్నపుడు, ధనుష్ కంటెంట్‌ని ధనుష్ కాష్ చేసుకునే హక్కు ఉండదా? అంటూ కామెంట్ చేశాడు.
దీనిపై పూనం కౌర్ స్పందిస్తూ.. దర్శకుడు త్రివిక్రమ్‌ను ఇందులోకి లాగింది. ఇదే లాజిక్ ప్రకారం త్రివిక్రమ్ కూడా కంటెంట్‌ను కాపీ చేస్తాడు దీని గురించి ఏం అంటారు ? అంటూ రాసుకొచ్చింది. దీంతో ఆమె చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఆమె కామెంట్స్ పై నెటిజన్స్ రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు.
Also Read : మూడు నెలల జీతం బ్రో.. మహేష్ టీ షర్ట్ ధర అన్ని వేలా?