Show Time: "షో టైమ్" అంటూ భయపెడుతున్న 'పొలిమేర' బ్యూటీ కామాక్షి..

నవీన్ చంద్ర, కామాక్షి భాస్కర్ల జంటగా నటిస్తున్న తాజా చిత్రం "షో టైమ్" సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఉగాది పండుగ సందర్భంగా చిత్ర బృందం విడుదల చేసింది. సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కించారు.

New Update
Show Time

Show Time

Show Time: నవీన్ చంద్ర(Naveen Chandra), కామాక్షి భాస్కర్ల(Kamakshi Bhaskarla) జంటగా మదన్ దక్షిణా మూర్తి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం "షో టైమ్" సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.ఈ సినిమాను అనిల్ సుంకర సమర్పణలో, స్కైలైన్ మూవీస్ ప్రొడక్షన్ పతాకంపై కిషోర్ గరికిపాటి నిర్మిస్తున్నారు. ఉగాది పండుగ సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు మేకర్స్. 

Also Read: సూట్ విప్పి.. ర్యాంప్ పై అదరగొట్టిన జాన్వీ.. నడుస్తుంటే మామూలుగా లేదుగా! వీడియో వైరల్

క్రైమ్ థ్రిల్లర్‌గా "షో టైమ్"..

ఫ్యామిలీ, క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కబోతుంది. ఒక కుటుంబం అనుకోని సమస్యల్లో చిక్కుకుని, వాటి నుంచి ఎలా బయటపడ్డారన్నదే ఈ మూవీ కథగా రిలీజ్ చేసిన పోస్టర్ లో కనిపిస్తుంది. నవీన్ చంద్ర ఓ పోలీస్ అధికారి నుండి తన భార్య, కూతురిని ఎలా కాపాడుకున్నాడు అన్న పాయింట్ తో సినిమాని మంచి థ్రిల్లర్ గా తెరకెక్కించారు.

Also Read: మోదీ లాగే నేను.. అందుకే పిల్లల్ని వద్దనుకున్నా : హరీష్ శంకర్

గతంలో నవీన్ చంద్ర చాలా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలలో నటించారు. కామాక్షి భాస్కర్ కూడా ‘మా ఊరి పోలిమేరా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. దీనితో ఈ "షో టైమ్" మూవీపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు.

Also Read: అవుడేటెడ్, బోరింగ్.. అసలేంటి ఈ సినిమా.. 'సికందర్' డైరెక్టర్ పై ఫ్యాన్స్ ట్రోలింగ్

Also Read: ఈసారైనా హిట్టు కొట్టు గురూ.. విజయ్ సేతుపతితో పూరి జగన్నాథ్ కొత్త సినిమా!

Advertisment
Advertisment
తాజా కథనాలు