సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన సంఘటన ఒక దురదృష్టకరమైన, విచారకర ఘటన. దీని నుంచి మనం అందరం ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. ఇకపై మరిన్ని జాగ్రత్తలు పాటించి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలి. ఇందులో మన అందరి తప్పూ ఉంది. ఒక వ్యక్తిని నిందించడం కరెక్ట్ కాందటూ నేచురల్ స్టార్ నాని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
మంచి సమాజం కావాలి..
అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడం సరైనది కాదని నాని అభిప్రాయపడ్డారు. సినిమా వాళ్ళకు సంబంధించిన విషయంలో ప్రభుత్వధికారులు, మీడియా అత్యుత్సాహం చూపిస్తుంది. ఇదే సాధారణ పౌరుల విషయంలో కూడా ఉండాలని కోరుకుంటున్నా అన్నారు నాని. మనం మంచి సమాజంలో జీవించాలి అంటూ కామెంట్ చేశారు.
సోషల్ మీడియాలో బన్నీకి మద్దతు..
మరోవైపు తెలుగు సనిమా ఇండస్ట్రీ మొత్తం అల్లు అర్జున్ అరెస్ట్, సంథ్యా థియేటర్ తొక్కిసలాట గురించి రియాక్ట్ అవుతున్నారు. సినీ దర్శకుడు అజయ్ భూపతి సైతం అల్లు అర్జున్ అరెస్ట్‌ను ఖండించారు. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదని ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. ఇక సోఫల్ మీడియాలో అల్లు అర్జున్‌కు చాలా మంది సపోర్ట్‌గా నిలుస్తున్నారు. #WeStandWithAlluArjun అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. ఈ హ్యాష్ ట్యాగ్‌తో బన్నీకి తమ మద్దతు తెలుపుతూ పోస్ట్‌లు పెడుతున్నారు.
Also Read: Mohan Babu: మోహన్‌బాబు ఆచూకీ కోసం గాలిస్తున్న పోలీసులు