The Paradise: టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. రీసెంట్ గా హయ్ నాన్న, సరిపోదా శనివారం, హిట్: థర్డ్ కేస్ చిత్రాలతో బ్యాక్ బ్యాక్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు 'ది పారడైజ్' అంటూ మరో పీరియాడిక్ యాక్షన్ డ్రామాతో సిద్ధమవుతున్నారు. ఇప్పటికే 'రా స్టేట్మెంట్' పేరుతో విడుదలైన గ్లిమ్ప్స్ వీడియో విపరీతమైన హైప్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలో మూవీ నుంచి మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. నాని ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. అలాగే నాని పాత్ర పేరును రివీల్ చేశారు. ఇందులో నాని జడల్ అనే పాత్రలో కనిపించబోతున్నారు.
ఫస్ట్ లుక్ పోస్టర్
పోస్టర్‌లో, నాని ఇంతకు ముందెన్నడూ చూడని అవతారంలో కనిపిస్తూ ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహాన్ని నింపాడు. డ్రెడ్‌లాక్డ్ జడలు, మందపాటి గడ్డం, హ్యాండిల్‌బార్ మీసాలతో గంభీరంగా కనిపిస్తున్నాడు. నాని మెడలో మందపాటి గొలుసులు, రాక్షసుడి బొమ్మతో ఉన్న ఒక లాకెట్ పాత్ర శక్తిని సూచిస్తోంది. అలాగే నాని బ్యాక్ గ్రౌండ్ లో కత్తులు, బుల్లెట్లతో తయారు చేయబడిన వృత్తాకార ఆయుధం సినిమా ఇంటెన్సిటీ తెలిసేలా చేస్తోంది. మొత్తానికి సినిమాలో నాని పాత్ర రా అండ్ రస్టిక్ గా ఉండబోతుందని ఫస్ట్ లుక్ చూస్తే అర్థమవుతోంది. మరోసారి శ్రీకాంత్ ఓదెల- నాని కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా 'దసరా' కి మించి ఉండబోతుందని తెలుస్తోంది. అంతేకాదు నాని కెరీర్ లోనే ఇదొక డిఫరెంట్ అండ్ కొత్త కాన్సెప్ట్ తో రూపొందుతున్నట్లు సమాచారం.
and His Name is JADAL 🔥🔥🔥 #TheParadise 🐦⬛@NameisNani X @odela_srikanth ❤️🔥❤️🔥❤️🔥
— Sivam C Kabilan (@kabilanchelliah) August 8, 2025
An @anirudhofficial musical 🧨🧨🧨@Dop_Sai@NavinNooli@SLVCinemasOffl@saregamasouthpic.twitter.com/qcD8gJq6J9
ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ పై సుధాకర చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇటీవలే నాని హైదరాబాద్ లో జరుగుతున్న షెడ్యూల్ లో జాయిన్ అయ్యారు. ఇందులో నానికి సంబంధించిన పలు యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. వచ్చే ఏడాది మార్చి 26న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 'దసరా' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత శ్రీకాంత్ ఓదెల నుంచి వస్తున్న 'పారడైస్' పై అంచనాలు భారీగా ఉన్నాయి. మరి శ్రీకాంత్ 'పారడైస్' తో మరోసారి ఆడియన్స్ ని మెప్పిస్తాడా లేదా అనేది చూడాలి.
ఇదిలా ఉంటే హీరో మాత్రమే కాదు మరోవైపు ప్రొడ్యూసర్ గా కూడా సత్తాచాటుతున్నారు నాని. తన సొంత బ్యానర్ 'వాల్ పోస్టర్' పై మంచి కంటెంట్ ఉన్న కథలను ప్రొడ్యూస్ చేస్తూ ముందుకెళ్తున్నారు. ఇటీవలే 'కోర్ట్: స్టేట్ వెర్సెస్ నోబడీ' సినిమాతో నిర్మాతగా భారీ విజయాన్ని అందుకున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న బడ్జెట్ తో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. నెక్స్ట్ చిరంజీవి- శ్రీకాంత్ ఓదెల రాబోతున్న సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం స్క్రిప్టింగ్ దశలో ఉంది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.