HIT 3 Leaked: నానికి బిగ్ షాక్.. 'హిట్ 3' ఫుల్ HD ప్రింట్ లీక్..!

నాని హిట్3 మూవీ విడుదలైన ఒక్క రోజులోనే ఆన్ లైన్ లో హెడీ ప్రింట్ లీకైంది. ఐబొమ్మా, మూవీ రూల్స్ వంటి ప్లాట్ ఫార్మ్స్ లో దర్శనమిచ్చింది. దీంతో నాని అభిమానులతో పాటు మూవీ టీమ్ ఆందోళన చెందుతున్నారు.

New Update

HIT 3 Leaked: ఈ మధ్య కాలం టాలీవుడ్ సినిమాలను పైరసీ భూతం పట్టిపీడిస్తోంది. సినిమా  విడుదలైన 24 గంటల్లోనే ఫుల్ హెడీ ప్రింట్ ఆన్లైన్ లో ప్రత్యక్షమవుతోంది. దీనిపై నిర్మాతలు, హీరోలు  కఠినంగా హెచ్చరిస్తున్నప్పటికీ లీకులు మాత్రం ఆగడంలేదు. 

హెడీ ప్రింట్ లీక్ 

తాజాగా మరో సినిమా పైరసీ భూతానికి బలైంది. మే1న విడుదలైన నాని 'హిట్3' విడుదలై 24 గంటలు గడవకముందే ఫుల్ హెడీ ప్రింట్ లీకైంది. 4xBet, ibomma, మూవీ రూల్స్ వంటి పైరసీ వెబ్ సైట్లలో ఒరిజినల్ ఆడియోతో దర్శనమిచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో నాని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే దీనిపై మూవీ టీమ్ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. 

latest-news | cinema-news | hit 3 | hit3 hd print leaked

Advertisment
Advertisment
తాజా కథనాలు