Nani Paradise: దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల- నాని కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ పారడైస్ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమా ఆడియో హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్లు ప్రచారం జరుగుతోంది. పలు నివేదికల ప్రకారం.. పాపులర్ మ్యూజిక్ కంపెనీ 'సరిగమపా' సుమారు రూ. 18 కోట్లు ఖర్చు చేసి 'పారడైస్' మ్యూజిక్ హక్కులను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సినిమా రిలీజ్ కి ముందే ఈ రేంజ్ లో ప్రీ రిలీజ్ లెక్కలు ఉండడం చిత్రబృందానికి ఉత్సాహాన్ని ఇచ్చింది. అంతేకాదు నాని సినీ కెరీర్ లో ఇంత పెద్ద మొత్తానికి ఆడియో రైట్స్ అమ్ముడవడం ఇదే మొదటిసారి అని సినీ వర్గాలు చెబుతున్నాయి. యంగ్ టాలెంట్ అనిరుధ్ రవి చంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
#Paradise - Records Hunt Begins!! pic.twitter.com/KGD5r1zzfL
— Aakashavaani (@TheAakashavaani) May 14, 2025
cinema-news | latest-news | telugu-news | paradise audio rights