అఖిల్ అప్పటి దాకా అభిమానుల ముందుకు రాడు.. నాగార్జున షాకింగ్ కామెంట్స్ అఖిల్ బయట కనిపించకపోవడం గురించి నాగార్జున తాజాగా నిర్వహించిన ఏఎన్ఆర్ @100 ఈవెంట్ లో మాట్లాడాడు.' ఈ ఈవెంట్ కు అఖిల్ రాలేదు. హిట్టు కొట్టాకే ఫ్యాన్స్ ముందుకి వస్తానని చెప్పాడు. మీ అందరిని అడిగినట్లు చెప్పమన్నాడు' అంటూ నాగార్జున చెప్పుకొచ్చాడు. By Anil Kumar 20 Sep 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి నాగార్జున నటవారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తొలి సినిమా 'అఖిల్' అంటూ ఫస్ట్ సినిమాతోనే గ్రాండ్ లెవల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అఖిల్ అక్కినేని. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా దారుణంగా ఫ్లాప్ అందుకుంది. ఇక ఆ తర్వాత మిస్టర్ మజ్ను, హలో, ఏజెంట్ అంటూ ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమాలు కూడా అఖిల్‌కు హిట్టును అందించలేకపోయాయి. ప్రస్తుతం హిట్ కొట్టాలనే కసితో సాలిడ్ ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడు ఈ అక్కినేని వారసుడు. ఇక అఖిల్ ఫ్యాన్స్ ముందు కనిపించి ఏడాదికి పైగా కావస్తోంది. కనీసం ఫ్యామిలీ ఈవెంట్స్ లోనూ కనిపించడం లేదు. తాజాగా అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకను అక్కినేని కుటుంబం గ్రాండ్‌గా ప్లాన్ చేసింది. #ANR lives on ♥️ #NagarjunaAkkineni about #akhilakkineni at #ANR100 birthday celebration in Hyderabad pic.twitter.com/5ksfKaxBYC — ARTISTRYBUZZ (@ArtistryBuzz) September 20, 2024 Also Read : చిరంజీవికి ఏఎన్నార్ అవార్డు.. స్వయంగా ప్రకటించిన నాగార్జున ఏఎన్ఆర్ @100 పేరిటా ఈ వేడుక నేడు జరుగగా ఈ వేడుకకు ముఖ్య అతిథిగా నాగార్జునతో పాటు నాగా చైతన్య అక్కినేని ఫ్యామిలీ హాజరు అయ్యింది. అయితే ఈ వేడుకలో అక్కినేని నాగార్జున మాట్లాడుతుండగా.. ఫ్యాన్స్ అందరూ అఖిల్ ఎక్కడా, అయ్యగారు ఎక్కడ అంటూ నాగార్జునను అడగడం మొదలుపెట్టారు. అయితే అఖిల్ బయట కనిపించకపోవడం గురించి తాజాగా నాగార్జున మాట్లాడాడు. హిట్టు కొట్టాకే కనిపిస్తా అన్నాడు... ఈ ఈవెంట్ కు అఖిల్ రాలేదు. హిట్టు కొట్టాకే ఫ్యాన్స్ ముందుకి వస్తానని చెప్పాడు. మీ అందరిని అడిగినట్లు చెప్పమన్నాడు' అంటూ నాగార్జున చెప్పుకొచ్చాడు. దీంతో నాగ్ చేసిన ఈ కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్ అవుతున్నాయి. అఖిల్ పట్టుదల చూసి అటు ఫ్యాన్స్ కూడా అతని కం బ్యాక్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారైనా అఖిల్ కు హిట్ కొడతాడా? లేదా ? చూడాలి. #nagarjuna #akkineni-akhil మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి