చిరంజీవికి ఏఎన్నార్ అవార్డు.. స్వయంగా ప్రకటించిన నాగార్జున

2024గానూ ఏయన్నార్‌ జాతీయ అవార్డు ను చిరంజీవికి ఇవ్వనున్నట్టు నాగార్జున ప్రకటించారు. అక్టోబరు 28న పురస్కారం ప్రదానం చేయనున్నట్టు తెలిపారు. ఆ వేడుకకు బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ ముఖ్య అతిథిగా హాజరవుతారని అన్నారు.

New Update
nagarjuna

ANR National Award: అక్కినేని నాగేశ్వరరావు శత జయంతిని పురస్కరించుకుని ఆర్కే సినీ ప్లెక్స్‌లో వేడుక నిర్వహించారు. ఇందులో అక్కినేని ఫ్యామిలీతో పాటూ ద ర్శకుడు రాఘవేంద్రరావు, నటుడు మురళీ మోహన్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా ఇదే వేడుకలో 2024గానూ ఏయన్నార్‌ జాతీయ అవార్డు ను చిరంజీవికి ఇవ్వనున్నట్టు నాగార్జున ప్రకటించారు. అక్టోబరు 28న పురస్కారం ప్రదానం చేయనున్నట్టు తెలిపారు. 

అమితాబ్ చేతుల మీదుగా...

ఆ వేడుకకు బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని తెలిపారు. ఈ మేరకు వేడుకలో భాగంగా నాగార్జున మాట్లాడుతూ.." నాన్న పేరు తలచుకుంటే మాకు చిరునవ్వు వస్తుంది. ఆయన నటించిన చిత్రాలు మళ్లీ మీ ముందుకొస్తున్నాయి.  నవంబరులో నిర్వహించనున్న ‘ఇఫి’ వేడుకలో నాన్న సినీ ప్రయాణంపై వీడియో ప్రదర్శించనున్నారు. 

Also Read : జానీ మాస్టర్ వివాదం.. రెండుగా చీలిన ఇండస్ట్రీ

నాన్నతో పాటు దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీతలు రాజ్‌ కపూర్‌ తదితరులపైనా స్పెషల్‌ వీడియోలు క్రియేట్‌ చేస్తున్నారు. చాలామంది అభిమానులు రక్తదానం చేయడం, ఆశ్రమాల్లో వృద్ధులకు భోజనం పెట్టడం చాలా సంతోషంగా ఉంది. మీ ఆదరణ ఎప్పటికీ మర్చిపోలేనిది. అవార్డు ఇవ్వనున్నామని చిరంజీవికి చెప్పగానే ఆయన ఎమోషనల్‌ అయ్యారు. దీనికంటే పెద్ద అవార్డు లేదన్నారు" అని పేర్కొన్నారు. 

అటు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ.." అక్కినేని, మా కుటుంబాలు వేరు వేరు కాదు. హైదరాబాద్‌కు తలమానికమైన అన్నపూర్ణ స్టూడియోస్‌ను ఏర్పాటు చేసి ఎంతో మందికి ఏయన్నార్‌ ఉపాధి ఇచ్చారు. నాగేశ్వరరావు- నాగార్జున కలిసి పనిచేయడం అదృష్టం అంటూ.. ఈ సందర్భంగా ఆయన తెరకెక్కించిన ‘శ్రీరామదాసు’ సినిమాల తండ్రీకొడుకులు ఒకరికొకరు నమస్కారం చేసుకునే సన్నివేశం వెనుక అంతరార్థం వివరించారు.

Advertisment
తాజా కథనాలు