Kuberaa Movie: బాక్సాఫీస్ వద్ద రఫ్ఫాడిస్తున్న 'కుబేరా'.. వారంలోనే 100కోట్ల క్లబ్ లోకి!

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో విడుదలైన 'కుబేరా' బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. విడుదలైన వారాంతంలోనే 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఈవిషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. సోషల్ డ్రామాగా రూపొందిన ఈచిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.  

New Update

Kuberaa Movie: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున, ధనుష్ లీడ్ రోల్స్ లో నటించిన 'కుబేరా' బాక్స్ ఆఫీస్ వద్ద పరుగులు పెడుతోంది. విడుదలైన వారాంతంలోనే రూ. 100 కోట్ల వసూళ్లను ఖాతాలో వేసుకుంది. ఇంకా వసూళ్ల జోరు కొనసాగుతూనే ఉంది. 100 కోట్ల క్లబ్ లో చేరిన సందర్భంగా చిత్రబృందం ఎక్స్ వేదికగా పోస్టర్ రిలీజ్ చేసింది.  

బిచ్చగాడిగా ధనుష్

సోషల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ప్రపంచంలో అత్యధిక ధనవంతుడైన వ్యక్తికి.. వీధుల్లో నివసించే బిచ్చగాడికి మధ్య జరిగే సంఘర్షణే ఈ సినిమా కథ. ఇందులో నాగార్జున ప్రభుత్వ అధికారి పాత్రను పోషించగా.. ధనుష్ 'బిచ్చగాడి' పాత్రను పోషించారు. ధనుష్ పాత్ర ప్రేక్షకులను అమాంతం ఆకట్టుకుంది. అలాగే సినిమాలోని రియల్ లొకేషన్స్, వాస్తవిక కథాంశం హైలైట్ గా కనిపించాయి. 'లవ్ స్టోరీ' తర్వాత 'కుబేరా' తో  వరుస హిట్లు అందుకున్నారు శేఖర్ కమ్ముల. 

Also Read: Chiranjeevi: శేఖర్ కమ్ముల చేయి వేయగానే చిరంజీవి ఎలా చేశారో చూడండి! వీడియో వైరల్

Advertisment
Advertisment
తాజా కథనాలు