తగ్గని నాగార్జున.. కొండా సురేఖపై పరువునష్టం దావా

నాగ చైతన్య, సమంత విడాకుల విషయంలో కొండా సురేఖ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కోర్టుకు వెళ్లిన నాగార్జున కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. తన కుటుంబానికి భంగం కలిగించారని, సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగ్ తన పిటిషన్ లో పేర్కొన్నారు.   

nagsurekha
New Update

నాగ చైతన్య, సమంత విడాకుల విషయంలో కొండా సురేఖ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ ఆమె క్షమాపణలు చెప్పారు. అయిన కూడా నాగార్జున వెనక్కి తగ్గకుండా లీగల్‌ నోటీసులు పంపాలని  నిర్ణయించుకున్న ఆయన ఇప్పటికే లీగల్‌ టీమ్‌తో నాగార్జున చర్చించి.. ఫైనల్ గా కోర్టుకు వెళ్లారు. ఈ మేరకు కొండా సురేఖపై నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. తన కుటుంబానికి భంగం కలిగించారని, కొండ సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగ్ తన పిటిషన్ లో పేర్కొన్నారు.   

సమంతకు క్షమాపణలు కోరిన సురేఖ..

మరోవైపు తాను చేసిన వ్యాఖలపై కొండా సురేఖ.. సమంతకు క్షమాపణలు చెప్పింది. నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ మీ  @Samanthaprabhu2 మనోభావాలను దెబ్బతీయడం కాదు అంటూ ట్వీటర్లో రాసుకొచ్చింది. స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం  అభిమానం మాత్రమే కాదు.. ఆదర్శం కూడా..నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ, మీ అభిమానులు కానీ  మనస్తాపానికి గురైనట్లైతే బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను.. అన్యద భావించవద్దు అంటూ  కొండా సురేఖ తన ఎక్స్ ఖాతాలో పేర్కొంది.

సమంత రియాక్షన్ ఇదే..

సురేఖ వ్యాఖ్యలపై సమంత రియాక్ట్ అవుతూ.. విడాకులు నా వ్యక్తిగత విషయమని.. ఇద్దరి అంగీకారంతోనే విడాకులు తీసుకున్నామని పేర్కొంది. ఇందులో రాజకీయ నేతల ప్రమేయం లేదని స్పష్టం చేసింది. ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని సూచించింది. '' ఒక మహిళగా బయటికి వచ్చి, గ్లామరస్ ఇండస్ట్రీలో రాణించాలంటే చాలా సాహసం, శక్తి అవసరం. కొండా సురేఖ గారు.. నా జీవిత ప్రయాణంపై నేను గర్వపడుతున్నాను. దీన్ని చిన్న చూపు చూడకండి. ఒక మంత్రిగా మీ వ్యాఖ్యలు ప్రభావం చూపిస్తాయని మీరు గ్రహిస్తారని భావిస్తున్నాను. వ్యక్తుల ప్రైవసీని గౌరవిస్తారని ఆశిస్తున్నాను. 

నా విడాకులు అనేవి వ్యక్తిగత విషయం. ఈ విషయం పట్ల దూరంగా ఉండాలని అభ్యర్థిస్తున్నాను. ఇద్దరి పరస్పర అంగీకారంతోనే మా విడాకులు జరిగాయి. ఇందులో ఎలాంటి రాజకీయ కుట్ర లేదు. రాజకీయాల నుంచి నా పేరు దూరంగా ఉంచండి. నేనెప్పుడు రాజకీయాలకు దూరంగానే ఉంటా. అలాగే ఉండటం కొనసాగిస్తానని'' సమంత తన ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. 

#konda-surekha #akkineni-nagarjuna
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe