మెగా బ్రదర్ నాగబాబు నివాసంలో విషాదం.. ఎమోషనల్ ట్వీట్ వైరల్!

మెగా బ్రదర్ నాగబాబు ఇంట్లో విషాదం నెలకొంది. 14 ఏళ్ల నుంచి తమతో ఉంటున్న కుక్క మృతి చెందడంతో నాగబాబు ఎమోషనల్ ట్వీట్ చేశారు. స్వర్గంలో హ్యాపీగా ఉండు.. మా జీవితాల్లో ఎప్పటికీ మీ పాద ముద్రలు చెక్కి ఉంటాయన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

New Update
Nagababu viral

Nagababu viral Photograph: (Nagababu viral)

మెగా నివాసంలో విషాదం నెలకొంది. కొణిదెల నాగబాబు ఇంట్లో ఎంతో ముద్దుగా పెంచుకున్న పెంపుడు కుక్క మృతి చెందింది. ఈ విషయాన్ని నాగబాబు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. దాదాపుగా 14 ఏళ్ల పాటు తమతో అద్భుతమైన ప్రయాణాన్ని సాగించి మృతి చెందడం బాధాకరమన్నారు. ఎప్పుడు కూడా పెంపుడు జంతువులా చూడలేదని, అంతకంటే ఎక్కువగా చూశానని తెలిపారు. నీ ప్రేమ, విధేయత, సహవాసం మా జీవితాల్లో వెలుగులు నింపాయన్నారు. నువ్వు చేసే వెర్రి చేష్టలు, కౌగిలింతలు, షరతులు లేని ప్రేమ మా ఇంటికి అపారమైన ఆనందాన్ని తెచ్చిపెట్టాయని నాగబాబు తెలిపారు.

ఇది కూడా చూడండి: గవర్నమెంట్ టీచర్ : దొరికినకాడికి దోచేసి అడ్డంగా బుక్కయ్యాడు.. సారూ మామూలోడు కాదు!

ఇది కూడా చూడండి: Mastan Sai : డ్రగ్స్ ఇస్తాడు.. న్యూడ్ వీడియోలు తీస్తాడు..  మస్తాన్ మాములోడు కాదయ్యా!

విడదీయరాని బంధం..

నా కుమార్తెకు మంచి స్నేహితురాలు, నమ్మకస్థురాలుగా ఉన్నావని, మీ బంధం అసలు విడదీయరానిదని అన్నారు. మీ ఇద్దరూ కలిసి ఎన్నో జ్ఞాపకాలు సృష్టించారని తెలిపారు. మా చివరి వీడ్కోలు.. ఎప్పటికీ నువ్వు మా గుండెల్లో ఉంటావని అన్నారు. మా జీవితాల్లో ఎప్పటికీ మీ పాద ముద్రలు చెక్కి ఉంటాయని తెలిపారు. స్వర్గంలో హ్యాపీగా ఉండండి.. సంతోషంగా ఆడుకోమని చివరిగా నాగబాబు వీడ్కోలు పలికారు. తమ కుక్కతో ఉన్న ఫొటోలను షేర్ చేశారు. దీంతో నెటిజన్లు ఆ కుక్కకి సంతాపం తెలియజేస్తున్నారు. 

ఇది కూడా చూడండి: అప్పర్ సర్క్యూట్‌ను తాకిన వీఆర్‌ఎల్ లాజిస్టిక్స్.. షేర్ ఎంత శాతం పెరిగిందంటే?

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు