sobhita akkineni : తండేల్ మూవీ రిలీజ్.. శోభిత ఇంట్రెస్టింగ్ పోస్ట్!

నాగచైతన్య సతీమణి శోభిత తండేల్ మూవీ టీమ్కు విషెస్ తెలిపారు. ఈ సినిమా చేస్తున్నన్ని రోజులు చైతన్య పాజిటివ్గా ఉన్నారని తెలిపారు. ఫైనల్లీ గడ్డం షేవ్ చేస్తావు. మొదటిసారి నీ ముఖం దర్శనం అవుతుంది సామీ' అంటూ ఆమె తన ఇన్స్టాగ్రామ్లో  పోస్ట్ పెట్టారు.

New Update
akkineni naga chaitanya sobhita

akkineni naga chaitanya sobhita

నాగచైతన్య, సాయిపల్లవి కాంబోలో తెరకెక్కిన మూవీ తండేల్.  చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన  ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరించగా..  అల్లు అరవింద్ ఈ చిత్రానికి సమర్పులుగా ఉన్నారు.  అయితే ఈ మూవీ రిలీజ్ సందర్భంగా నాగచైతన్య సతీమణి శోభిత మూవీ టీమ్ కు విషెస్ తెలిపారు. ఈ సినిమాపై చైతూ చాలా దృష్టి పెట్టారని..  చేస్తున్నన్ని రోజులు పాజిటివ్ గా ఉన్నారని తెలిపారు.  అలాగే ప్రేక్షకులందరితో పాటు శోభితా కూడా థియేటర్‌లో తండేల్ చిత్రాన్ని వీక్షాస్తానని చెప్పుకొచ్చింది. 'ఫైనల్లీ గడ్డం షేవ్ చేస్తావు. మొదటిసారి నీ ముఖం దర్శనం అవుతుంది సామీ' అంటూ చైతూను ఉద్దేశిస్తూ ఆమె తన ఇన్ స్టా గ్రామ్ లో  పోస్ట్ పెట్టారు. ఈ మూవీ కోసం చాలా రోజులుగా నాగచైతన్య గడ్డం లుక్ లోనే ఉన్నారు.  కాగా వీరిద్దరికి గతేడాది డిసెంబర్ 4న వీరి వివాహమైన సంగతి తెలిసిందే.

sobita
sobita

 

డీఎస్పీ సినిమాకు ప్రాణం

ఇక  తండేల్ సినిమా విషయానికి వస్తే ఇది  మత్య్సకారులకు సంబంధించిన స్టోరీ. శ్రీకాకుళం నుంచి వెళ్ళినవారు పాకిస్తాన్ కు చేరుకుని అక్కడ ఎలా ఇరుక్కుపోయారు. అక్కడ నుంచి వారిని భారతదేశ ప్రభుత్వం వారిని ఎలా విడిపించుకొచ్చింది అన్నదే కథ. దాంతో పాటూ ఇందులో నాగచైతన్య, సాయిపల్లవి మధ్య లవ్ కూడా ఉంది. లవ్ సాంగ్స్ కు పెట్టింది పేరైనా డీఎస్పీ తండేల్ సినిమాకు ప్రాణం పెట్టేశాడని చెబుతున్నారు సినిమా చూసిన ఫ్యాన్స్. చాలా గ్యాప్ తరువాత అదిరిపోయే లవ్ సాంగ్స్ ఇచ్చాడని అంటున్నారు. . ఇక ఇందులో ఆర్ఆర్ కూడా దేవీ శ్రీ ప్రసాద్ అదరగొట్టేశాడని చెబుతున్నారు. పాటలు తెరపై విజువల్ ట్రీట్‌ ఇస్తున్నాయని పోస్ట్ లు పెడుతున్నారు.  

Also Read :  అమెరికాలో కోడిగుడ్ల కొరత.. ఏకంగా రూ.35 లక్షల విలువ గల గుడ్లు దొంగతనం!

Also Read :   ట్రాన్స్జెండర్ను ప్రేమించి.. తండ్రి సమాధి వద్ద సూసైడ్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు