అక్కినేని నాగచైతన్య రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. సమంతతో విడాకులు తీసుకున్న అనంతరం నటి శోభితతో ప్రేమలో పడ్డాడు. కొన్నాళ్లు వీరిద్దరూ ప్రేమలో మునిగి తేలారు. అప్పుడప్పుడు మీడియా కంట పడి వైరల్ అయ్యేవారు. కానీ వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు ఏనాడు బయట చెప్పలేదు. ఇక ఇటీవలే గాసిప్స్‌ను నిజం చేశారు.
Also Read: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న ఇద్దరు స్టార్ సింగర్స్.. ఫొటోలు వైరల్
ఆగస్టు 8న నిశ్చితార్థం
ఈ ఏడాది ఆగస్టు 8న నిశ్చితార్థం చేసుకుని అందరినీ షాక్‌కు గురి చేశారు. అప్పటి వరకు తమ ప్రేమ బంధంపై నోరు విప్పని ఈ లవ్ కపుల్ ఒక్కసారిగా ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో అంతా షాక్ అయ్యారు. ఇక నిశ్చితార్థంకు సంబంధించిన ఫొటోలను నాగార్జున సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
దీంతో అక్కినేని అభిమానులు చైతు-శోభితలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక అప్పటి నుంచి వీరి పెళ్లి ఎప్పుడెప్పుడా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి తాజాగా ఓ సర్ప్రైజ్ అందింది. వీరిద్దరి పెళ్లికి సంబంధించి వెడ్డింగ్ కార్డు నెట్టింట వైరల్ అవుతోంది.
డిసెంబర్ 4న వివాహం
డిసెంబర్ 4న వీరిద్దరి వివాహం జరగబోతుందంటూ ఓ పెళ్లికార్డు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ఆ పెళ్లి కార్డు చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. చాలా సింపుల్‌గా ఉన్న పెళ్లికార్డు చూసి నివ్వెరబోతున్నారు. సెలబ్రిటీల పెళ్లి కార్డు ఎంతో గ్రాండ్‌గా ఉంటుందని అనుకున్నారు. కానీ వీరి వెడ్డింగ్ కార్డు చూసి సింపుల్‌గా ఉండటంతో ఆశ్చర్యపోతున్నారు.