ఈరోజు ఘనంగా నాగచైతన్య- శోభిత పెళ్లి.. గెస్ట్ లిస్ట్ ఇదే

అక్కినేని నాగచైతన్య- శోభిత ఈరోజు మూడు ముళ్ళ బంధంతో ఒకటి కాబోతున్నారు. అన్నపూర్ణ స్థూసియోస్ లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య రాత్రి 8 గంటలకు వివాహం జరగనుంది. వీరి పెళ్ళిలో చిరంజీవి, రామ్‌చరణ్, మహేష్, ప్రభాస్, రాజమౌళి అతిథులుగా సందడి చేయనున్నారు.

New Update
naga chaitanya

Naga Chaitanya- Sobhita

Naga Chaitanya- Sobhita:  అక్కినేని నాగచైతన్య- శోభిత వివాహం మరికొన్ని గంటల్లో జరగనుంది. ఈరోజు రాత్రి 8 గంటలకు అన్నపూర్ణ స్థూడియోస్ లోని ఏఎన్నార్ విగ్రహం ముందు కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఈ జంట మూడు ముళ్ళ బంధంతో ఒకటి కాబోతున్నారు. కొత్త జంటపై ఏఎన్నార్ ఆశీస్సులు  ఉండాలనే ఉద్దేశంతో ఇరు కుటుంబ సభ్యులు అక్కడ నిర్వహించాలనే నిర్ణయించారు.  చైతన్య, శోభిత వివాహం తెలుగు బ్రాహ్మణ సంప్రదాయాల ప్రకారం జరగనుంది. 

Also Read: ప్రేమ పాటలతో యువతను ఉర్రూతలూగించాడు.. కానీ ఆ ఒక్క తప్పే అతని జీవితాన్ని మార్చేసింది?

గెస్ట్ లిస్ట్

చై- శోభిత పెళ్ళికి కుటుంబ సభ్యులు, సన్నిహితులతో పాటు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తారలు, రాజకీయ నాయకులతో సహా  300 మందికి పైగా గెస్టులు  హాజరు కానున్నారు. అంతేకాదు వీరి వివాహానికి కొందరు ప్రత్యేక అతిథులు హాజరుకానున్నారు. చిరంజీవి, రామ్‌చరణ్, ఉపాసన, మహేష్, నమ్రత, ప్రభాస్, ఎస్ఎస్ రాజమౌళి, పివి సింధు, నయనతార దంపతులు, ఎన్టీఆర్ దంపతులు దగ్గుబాటి కుటుంబం పెళ్లి వేడుకల్లో సందడి చేయనున్నారు.

Also Read: అయ్యో.. ఆ నర్సు గుర్తు పట్టకపోతే.. కులశేఖర్ చనిపోయిన విషయం కూడా తెలిసేది కాదు..!

ఇది ఇలా ఉంటే.. నాగచైతన్యతో పాటు అతని తమ్ముడు అఖిల్ కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. అఖిల్ నవంబర్ 26న జైనాబ్ రవద్జీ అనే అమ్మాయిని నిశ్చితార్థం చేసుకున్నాడు.  ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో నాగార్జున ఇంట్లో ఈ వేడుక జరిగింది. వచ్చే ఏడాది వీరి వివాహం జరగనుందట.జైనబ్‌ చిత్రకారిణి, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ గా మంచి పేరుంది. మన దేశంలోనే కాక దుబాయ్‌, లండన్‌ లోనూ ప్రదర్శనలిచినట్లు తెలిసింది. ఆమె హైదరాబాద్‌ లో పుట్టి ముంబయిలో స్థిరపడ్డట్లు సమాచారం. జైనబ్‌ తండ్రి జుల్ఫీ , నాగార్జునకు మధ్య కొన్నేళ్లుగా స్నేహం ఉంది. 

Also Read:నాగచైతన్య హల్దీ ఫంక్షన్ లో అఖిల్ ఏం చేశాడో చూడండి.. ఫొటో వైరల్!

Advertisment
తాజా కథనాలు