Nabha Natesh: 'ఇస్మార్ట్ పోరీ' రీబూట్.. అందంతో మళ్ళీ ఆకట్టుకునే ప్రయత్నం!

సినిమాల పరంగా కాస్త స్లో అయినా.. సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటో షూట్లతో నెట్టింట మంటలు పుట్టిస్తోంది ఇస్మార్ట్ బ్యూటీ నభా. బ్లూ డ్రెస్ లో ఈ ముద్దుగుమ్మ స్టన్నింగ్ ఫోజులు కుర్రాళ్లను ఫిదా చేస్తున్నాయి. ఈ పిక్స్ పై మీరు ఓ లుక్కేయండి.

New Update
nabha natesh glamorous looks

nabha natesh glamorous looks

Nabha Natesh:'ఇస్మార్ట్ శంకర్'  సినిమాతో కుర్రకారును ఉర్రూతలూగించిన  ముద్దుగుమ్మ నభాకు ప్రస్తుతం అవకాశాలే కరువయ్యాయి.  'ఇస్మార్ట్ శంకర్'  తర్వాత  ఈ బ్యూటీ ఫుల్ బిజీ అయిపోతుందని అంతా అనుకున్నారు. కానీ అనుకున్నట్లు అదృష్టం కలిసి రాలేదు. ఆ సినిమా తర్వాత అడపాదడపా సినిమాలు చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి.  రీసెంట్ గా ప్రియదర్శి  సినిమాలో 'డార్లింగ్' సినిమాలో  మెరిసింది. ఇది కూడా ఈ ఇస్మార్ట్ బ్యూటీకి కలిసి రాలేదు. అయినప్పటికీ కొత్త సినిమాలకు సిద్ధమవుతూ, దర్శక నిర్మాతలను ఆకట్టుకునే ప్రయత్నాల్లో ఉంది. 

nabha natesh
nabha natesh

తరచూ సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటో షూట్లతో అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా బ్లూ డ్రెస్, ట్రెండీ హెయిర్ స్టైల్ తో అదిరిపోయే లుక్ లో దర్శనమిచ్చింది.   క్లివేజ్ అందాలతో నభా స్టన్నింగ్ ఫొటో షూట్ కుర్రకారును  ఫిదా చేస్తోంది.  

 

ismart beauty nabha
ismart beauty nabha

స్లిమ్ ఫిగర్, స్టైలిష్ హెయిర్‌కట్  ఆమెకు కొత్త గ్లామర్‌ను తెచ్చిపెట్టాయి. ఈ ఫొటోలను చూస్తే మన  'ఇస్మార్ట్ బ్యూటీ' యేనా అని అనిపించకమానదు. ఈ పిక్స్ చూసిన అభిమానులు  "అదిరిపోయావు నభా!", "సూపర్ స్టైలిష్" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.  ఇంత అందమైన నభాకు ఆఫర్లు రావడం లేదే అని ఆవేదన చెందుతున్నారు ఆమె ఫ్యాన్స్.  గ్లామరస్ నభా త్వరలోనే మంచి అవకాశాలతో బిజీ అవుతుందని ఆశిద్దాం

Also Read: నిత్య పెళ్లి కూతురు అరెస్ట్.. అలాంటి మగవాళ్లే టార్గెట్..వలలో 12 మంది అమాయకులు!

Advertisment
Advertisment
తాజా కథనాలు