'కుర్చీ మడతపెట్టి' సాంగ్ కి మృణాల్ మాస్ స్టెప్పులు.. వీడియో వైరల్ ఇటీవల ఓ వేడుకకు గెస్ట్ గా హాజరైన మృణాల్ ఠాకూర్.. ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్‌కు స్టెప్పులేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని చూసిన మహేష్ ఫ్యాన్స్ మృణాల్ డ్యాన్స్ కు ఫిదా అవుతూ వీడియోపై లైకుల వర్షం కురిపిస్తున్నారు. By Anil Kumar 22 Sep 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీ లీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'గుంటూరు కారం' సినిమా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సినిమా ఆశించిన స్థాయిలో లేకపోయినా పాటలు మాత్రం రిలీజ్ కు ముందే చార్ట్ బస్టర్ అయ్యాయి. తమన్ ఈ సినిమా కోసం కంపోజ్ చేసిన సాంగ్స్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సినిమాలో 'కుర్చీ మడత పెట్టి' అనే పాట ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యూట్యూబ్ లో మిలియన్ల కొద్ది వ్యూస్ సాధించడమే కాకుండా సోషల్ మీడియాలో రీల్స్ రూపంలో బాగా ట్రెండ్ అయింది. ఇప్పటికీ ఎక్కడో చోట ఈ సాంగ్ వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా ఈ పాటకు టాలీవుడ్ భామ 'సీతారామం' బ్యూటీ మృణాల్ ఠాకూర్ డ్యాన్స్ చేసింది. Also Read : 'కల్కి' పార్ట్-2 టైటిల్ ఫిక్స్.. ఈసారి అంతకుమించి Mrunal dancing to Kurchi Madathapetti - this video made my day 🥹💥@mrunal0801 😻❤️ #MaheshBabu #MrunalThakur #GunturKaaram #SSMB29pic.twitter.com/yuiwOxxBcw — 𝙽𝚒𝚝𝚝𝚞.𝙼𝙱.𝙲𝙱𝙽🦸🏻♂️ (@Niteesh__09) September 22, 2024 మృణాల్ మాస్ స్టెప్స్ అదుర్స్.. రీసెంట్‌గా ఓ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన మృణాల్ ఠాకూర్ ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్‌కు స్టెప్పులేసింది. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీన్ని చూసిన మహేష్ ఫ్యాన్స్ మృణాల్ డ్యాన్స్ కు ఫిదా అవుతూ వీడియోపై లైకుల వర్షం కురిపిస్తున్నారు. ఇక మృణాల్ ఠాకూర్ విషయానికొస్తే.. 'సీతారామం' సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరోయిన్.. మొదటి సినిమాతోనే తన అద్భుత నటనతో ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ సినిమాలతో అలరించింది. రీసెంట్ గా వచ్చిన ప్రభాస్ 'కల్కి' మూవీలో గెస్ట్ రోల్ లో కనిపించి ఆకట్టుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో పూజా మేరీ జాన్, హై జవానీ తో ఇష్క్ హోనా హై, సన్ ఆఫ్ సర్దార్ 2.. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉంది. #actress-mrunal-thakur సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి