Gurram Paapi Reddy Teaser: 'జాతిరత్నాలు' సినిమాతో నవ్వులు పూయించిన ఫరియా మరో కామెడీ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఫరియా, నరేష్ అగస్త్యా ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'గుర్రం పాపిరెడ్డి' టీజర్ విడుదల చేశారు. ఇదొక డార్క్ కామెడీ థ్రిల్లర్ కథతో రాబోతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. నవ్వులు, యాక్షన్, కామెడీ సన్నివేశాలతో కొత్త అనుభూతుని ఇస్తోంది టీజర్.
నవ్వులు పూయిస్తున్న టీజర్
టీజర్ ఓపెనింగ్ లోనే బ్రహ్మానందం జడ్జ్ పాత్రలో తన కామిక్ టైమింగ్ తో ఆకట్టుకున్నారు. కోర్టులో దోషి అదొక 16వ శతాబ్దం అంటూ స్టోరీ మొదలు పెట్టడంతో.. బ్రహ్మానందం ''చెప్పారా, చెప్పు.. నువ్వు చెప్పేదంతా వింటూ ఉంటాము'' అంటూ నవ్వులు పూయించారు. అలాగే బ్రహ్మానందం, ఫరియా కోర్ట్ సీన్స్ 'జాతిరత్నాలు' సినిమాను మరోసారి గుర్తుచేస్తున్నాయి. యోగి బాబు, హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గారు, రాజ్ కుమార్ కసిరెడ్డి, వంశీధర్ కోస్గి, జీవన్ కుమార్, జాన్ విజయ్, మొట్టా రాజేంద్రన్ తదితర కమెడియన్స్ తమ పాత్రలతో నవ్వులు పూయించారు. టీజర్ చూస్తుంటే సినిమా ఫుల్ ఫన్ రైడ్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఒక పురాతన నిధి కోసం హీరోతో పాటు కొంతమంది కలిసి దొంగతనం ప్లాన్ చేస్తారు. ఈ క్రమంలో వారికి ఎదురయ్యే సంఘటనలు, వారి మధ్య జరిగే సన్నివేశాలే ఈ సినిమా కథ.
Who is the hero of #GurramPaapiReddy ? 🧐
— TrackTollywood (@TrackTwood) August 3, 2025
Find out in the Teaser, dropping on August 4th 🤗⚰️
Written & Directed by - @DirMuraliManopic.twitter.com/ZTyDCAfufb
ఇందులో ఫరియా 'సౌదామిని' అనే పాత్రలో నటిస్తోంది. ఆమె పాత్ర సినిమాలో చాలా కీలకంగా ఉండబోతుందని, ఈ సినిమాతో ఆమెకు మంచి పేరు వస్తుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేసింది. ఇది ఫరియా కెరీర్ మరో 'జాతిరత్నాలు' కాబోతుందని ఆడియన్స్ కూడా భావిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఫరియా తల్లి కూడా ఒక చిన్న క్యామియోలో నటించడం ఆసక్తికరంగా మారింది. మురళీ మనోహర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని MJM మోషన్ పిక్చర్స్, బురా అండ్ సద్ది క్రియేటివ్ ఆర్ట్స్ బ్యానర్ పై వేణు సద్ది, అమర్ బుర్ర, జయప్రకాష్ సంయుక్తంగా నిర్మించారు.
ఇదిలా ఉంటే ఫరియా 'జాతిరత్నాలు' సినిమాతో ఇండస్ట్రీలో ఫుల్ స్టార్ డమ్ సంపాదించుకుంది. యూత్ లో ఈ అమ్మడు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే పెరిగింది. 'చిట్టి' పాత్రలో తన నటన, కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా సక్సెస్ తర్వాత ఫరియా అవకాశాలకు కొదవలేకుండా పోయింది. హిట్, ప్లాపులు పక్కన పెడితే వరుస సినిమాలు చేస్తూ పోతుంది. సినిమాలతో పాటు పలు స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా మెరిసింది ఈ బ్యూటీ. ఇటీవలే 'మత్తు వదలరా' సినిమాతో సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ఫరియా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, ఆ ఒక్కటి అడక్కు, రావణాసుర, బంగారాజు పలు సినిమాల్లో మెరిసింది.
Also Read: DQ41 Movie: దుల్కర్ సల్మాన్ కి క్లాప్ కొట్టిన నాని.. 'DQ41' తో కొత్త ప్రాజెక్ట్ ! ఫొటోలు చూశారా