Bigg Boss Promo: బిగ్ బాస్ కొత్త ప్రోమో వచ్చేసింది.. కంటెస్టెంట్స్ వీళ్ళే!

మలయాళం బిగ్ బాస్  ప్రోమో విడుదలైంది. మలయాళంలో ప్రస్తుతం 7వ సీజన్ రన్ అవుతోంది. రెండు నిమిషాల 25 సెకన్ల ఈ ప్రోమోలో హోస్ట్ మోహన్‌లాల్ ఇంతకుముందు ఎప్పుడూ చూడని విధంగా డిఫరెంట్ లుక్ కనిపించి ఆకట్టుకున్నారు.

New Update

Bigg Boss Promo: బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ జాతర మళ్ళీ మొదలైంది. అన్ని భాషల్లోనూ  కొత్త సీజన్ షురూ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ మేరకు ఇప్పటికే తెలుగు బిగ్ బాస్   ప్రోమో విడుదలవగా.. తాజాగా మలయాళం బిగ్ బాస్  ప్రోమో విడుదలైంది. మలయాళంలో ప్రస్తుతం 7వ సీజన్ రన్ అవుతోంది. రెండు నిమిషాల 25 సెకన్ల ఈ ప్రోమోలో హోస్ట్ మోహన్‌లాల్ ఇంతకుముందు ఎప్పుడూ చూడని విధంగా డిఫరెంట్ లుక్ కనిపించి ఆకట్టుకున్నారు. గత 6 సంవత్సరాలుగా హీరో మోహన్ లాల్ మలయాళం బిగ్ బాస్ హోస్టుగా వ్యవహరిస్తున్నారు. 

బిగ్ బాస్ ప్రోమో 

సేఫ్ గేమర్ల నుంచి విక్టిమ్ ఆడే వారి వరకు అన్ని రకాల కంటెస్టెంట్స్ లక్షణాలను చూపిస్తూ ప్రోమో సరదాగా సాగింది. సెలెబ్రెటీలతో పాటు సామాన్యులు ఈ సీజన్ లో సందడి చేయబోతున్నట్లు మోహన్ లాల్ హింట్ ఇచ్చారు. ఈ ప్రోమో మీరు కూడా చూడండి. 

సేఫ్ గేమర్ల నుంచి విక్టిమ్ ఆడే వారి వరకు అన్ని రకాల కంటెస్టెంట్స్ లక్షణాలను చూపిస్తూ ప్రోమో సరదాగా సాగింది. సెలెబ్రెటీలతో పాటు సామాన్యులు ఈ సీజన్ లో సందడి చేయబోతున్నట్లు మోహన్ లాల్ హింట్ ఇచ్చారు. 

సీజన్ 7 ఆగస్టు 3 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. గత సీజన్ల మాదిరిగానే ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ కూడా చెన్నైలో నిర్మించబడుతోంది. ఈసారి ఇంటిని సరికొత్త థీమ్, లేఅవుట్‌తో డిజైన్ చేస్తున్నారని టాక్. సీజన్ 7 పోటీదారులకు సంబంధించిన అధికారిక ప్రకటన చేయనప్పటికీ.. కానీ రేణు సుధీ, అనుమోల్, అక్బర్ ఖాన్,  జసి ఆషి పేర్లు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. 

Also Read: BIG BREAKING: తెలంగాణ హైకోర్టులో చిరంజీవి పిటిషన్.. ఆ అంశంపై కోర్టుకెక్కిన మెగాస్టార్!

Advertisment
Advertisment
తాజా కథనాలు