టాలీవుడ్ లో ఇప్పుడంతా అందాల బ్యూటీ మీనాక్షి చౌదరి పేరే వినిపిస్తోంది. సుశాంత్ హీరోగా వచ్చిన 'ఇచ్చట వాహనములు నిలపరాదు' సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత వరుసగా యంగ్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేసింది. కాగా ఈ ఏడాది మహేష్ బాబుతో గుంటూరు కారం, దళపతి విజయ్ తో గోట్ సినిమాలతో సూపర్ క్రేజ్ అందుకుంది.
ఈ హీరోయిన్ తాజాగా నటించిన 'లక్కీ భాస్కర్' చిత్రం దీపావళి కానుకగా థియేటర్స్ లో రిలీజై భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీలో మీనాక్షి.. దుల్కర్ సల్మాన్ కు భార్యగా హోమ్లీ క్యారెక్టర్ లో నటించి ఆకట్టుకుంది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ హీరోయిన్.. ఇక నుంచి భార్య, తల్లి పాత్రలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని చెప్పింది.
Also Read : రాజమౌళి - మహేష్ సినిమాకు బిగ్ షాక్.. తప్పుకున్న స్టార్ టెక్నీషియన్?
ఆ తరహా క్యారెక్టర్స్ చేయను..
' లక్కీ భాస్కర్’ చిత్రంలో నా నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. అయితే కొంతమంది మాత్రం కెరీర్ ఆరంభంలో హౌస్‌వైఫ్ పాత్రలు చేయకపోవడమే బెటర్ అని, అందుకు చాలా సమయం ఉందని సలహా ఇచ్చారు. ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా నేను ఆ క్యారెక్టర్‌ను ఎంతగానో ఇష్టపడి చేశాను. అయితే రాబోవు కొన్నేళ్ల పాటు ఆ తరహా క్యారెక్టర్స్ చేయొద్దని నిర్ణయించుకున్నా.
త్వరలో నేను ఓ యాక్షన్ సినిమా చేయబోతున్నా. అందులో పోలీస్ క్యారెక్టర్‌ను పోషిస్తున్నా. కెరీర్‌లో తొలిసారి పోలీస్ అధికారి పాత్రను చేయడం ఎక్సైయిటింగ్‌గా అనిపిస్తోంది..' అంటూ చెప్పుకొచ్చింది. ఇక త్వరలో ఈ ముద్దుగుమ్మ నుంచి 'మెకానిక్ రాకీ', 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
Also Read : పెళ్ళికి రెడీ అయిన కీర్తి సురేష్.. గోవాలో వెడ్డింగ్, అబ్బాయి ఎవరంటే?