‘లే లే రాజా’.. ఐటమ్ సాంగ్ లో నోరా ఫతేహీ అదిరిందిగా!

మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మట్కా'. తాజాగా మేకర్స్ ఈ మూవీ నుంచి ‘లే లే రాజా’ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ పాటలో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీ డాన్స్ మూవ్స్ అదిరిపోయాయి. ఈ పాట మీరు కూడా చూసేయండి.

New Update

MATKA:  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'మట్కా'. 1950, 1980 కాలం నాటి  కథాంశంతో   పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని  'పలాస 1978' ఫేమ్ కరుణకుమార్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్, టీజర్ లో డిఫరెంట్ షేడ్స్ లో కనిపించిన వరుణ్ లుక్ సినిమా పై మంచి బజ్ క్రియేట్ చేయగా.. తాజాగా సినిమా పై మరింత ఆసక్తిని పెంచేలా మూవీ నుంచి బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీ ఐటమ్ సాంగ్ రిలీజ్ చేశారు. 

Also Read: ఈ వారం ఓటీటీ, థియేటర్స్ లో సినిమాల పండగ.. లిస్ట్ ఇదే!

'లే లే రాజా'

'లే లే రాజా' అంటూ సాగిన ఈ ఐటమ్ నెంబర్ లో నోరా ఫతేహీ డాన్స్ మూవ్స్ అదిరిపోయాయి. సాంగ్ మధ్యలో వింటేజ్ లుక్ లో వరుణ్ ఎంట్రీ హైలైట్ గా కనిపించింది. జీవీ ప్రకాష్ కుమార్  ఈ పాటకు సంగీతం అందించారు. వైరా, SRT ఎంటర్ టైన్మెంట్ బ్యానర్స్  పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల,  రజనీ తాళ్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరీ ఫీమేల్ లీడ్ గా నటిస్తుండగా.. నోరా ఫతేహీ మరో కీలక పాత్రలో నటిస్తోంది.  నవీన్ చంద్ర, కన్నడ కిషోర్, అజయ్ ఘోష్, మైమ్ గోపి, రూపలక్ష్మి, విజయరామరాజు, జగదీష్, రాజ్ తిరందాస్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Also Read: వామ్మో ఈ ఆంటీ నక్క తోక తొక్కింది.. వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది!

రీసెంట్ గా విడుదలైన గని, గాండీవ‌ధారి అర్జున, 'ఆపరేషన్ వాలెంటైన్'  కూడా  బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్లుగా నిలిచాయి.  ఈ క్రమంలో మెగా హీరోకు 'మట్కా' విజయం కీలకం కానుంది. మరి ఈ సినిమాతోనైనా కమ్ బ్యాక్ అవుతాడా లేదా చూడాలి. ఈ చిత్రం నవంబర్ 14న తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. 

Also Read:  PCOS మహిళల్లో ఆ సమస్య ఉంటే మరింత ప్రమాదమా!

ఇది కూడా చదవండి: మర్డర్ మిస్టరీ.. థ్రిల్లింగ్ గా కృతి, కాజోల్ 'దో పత్తి' ట్రైలర్

Advertisment
Advertisment
తాజా కథనాలు