/rtv/media/media_files/2025/07/16/manisha-koirala-2025-07-16-12-45-59.jpg)
Manisha Koirala
Manisha Koirala: బాలీవుడ్ సీనియర్ నటి మనీషా కొయిరాలాకు అరుదైన గౌరవం దక్కింది. లండన్ లోని యూనివర్సిటీ ఆఫ్ బ్రాడ్‌ఫోర్డ్ ఆమెకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ విషయాన్ని మనీషా తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. అలాగే డాక్టరేట్ ప్రధానం చేసిన వీడియోను కూడా పంచుకున్నారు. తనకు విద్య చదువుకోవడం ద్వారా కాకుండా నిజ జీవిత అనుభవాల ద్వారా వచ్చిందని తెలిపారు.
Also Read: నిమిషను క్షమించేది లేదు, ఉరిశిక్ష పడాల్సిందే.. బాధిత కుటుంబం సంచలనం
యూనివర్సిటీ ఆఫ్ బ్రాడ్‌ఫోర్డ్
ఈ మేరకు మనీషా తన పోస్టులో ఇలా రాసుకొచ్చింది.. నేను సాంప్రదాయ విద్యా మార్గం ద్వారా వచ్చిన వ్యక్తిగా ఇక్కడ నిలబడలేదు. జీవితంలో ఎదుర్కున్న కష్టాలు, వైఫల్యాల నుంచి నేర్చుకున్న వ్యక్తిగా నిలబడ్డాను. ఈ గౌరవం నేను మాటల్లో చెప్పలేనంత విలువైనది. మీరు ఎక్కడి నుంచి జీవితం ప్రారంభించినా.. చివరికి మీ ప్రయాణం ముఖ్యమని ఇది రుజువు చేస్తుంది. నా కథకు విలువనిచ్చి, గుర్తించిన యూనివర్సిటీ ఆఫ్ బ్రాడ్‌ఫోర్డ్‌కు కృతజ్ఞతలు అని పోస్ట్ పెట్టారు.
అమ్మమ్మే 'మొదటి గురువు'
అలాగే మనీషా కొయిరాలా తన దివంగత అమ్మమ్మ సుశీలా కొయిరాలా గురించి కూడా ప్రస్తావించారు. తన అమ్మమ్మే తన 'మొదటి గురువు' అని తెలిపారు. చిన్నతనంలో తన అమ్మమ్మ నుంచే జీవిత విలువలు, భరతనాట్యం, మణిపురి నృత్యం, పుస్తకాలు చదవడం నేర్చుకున్నానని గుర్తు చేసుకున్నారు.
ఇదిలా ఉంటే.. మనీషా కొయిరాల చివరిగా సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన 'హీరామండి: ది డైమండ్ బజార్' లో మల్లికాజాన్ పాత్రలో మరోసారి తన నటనతో ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో మనీషా నటనకు ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫెయిర్ ఓటీటీ అవార్డు లభించింది.