/rtv/media/media_files/2025/10/08/manchu-vishanu-2025-10-08-16-01-54.jpg)
ప్రముఖ నటుడు మోహన్ బాబుకు చెందిన మోహన్ బాబు యూనివర్సిటీపై ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ భారీ జరిమానా విధించింది.యూనివర్సిటీకి రూ,15 లక్షల జరిమానా విధించింది. యూనివర్సిటీ ఇప్పటికే ఈ మొత్తాన్ని చెల్లించింది.2022-23 విద్యా సంవత్సరం నుంచి సెప్టెంబర్ 2024 వరకు విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేశారనే ఆరోపణలు విచారణలో నిజమని తేలింది.యూనివర్సిటీ విద్యార్థుల నుంచి సుమారు రూ. 26.17 కోట్లు అదనంగా వసూలు చేసినట్లు కమిషన్ గుర్తించింది.
మంచు విష్ణు స్పష్టత
ఈ వ్యవహారంపై యూనివర్సిటీ ప్రో-ఛాన్సలర్ మంచు విష్ణు స్పష్టత ఇచ్చారు. ఉద్దేశపూర్వకంగా మీడియాలో ప్రసారం చేస్తున్న నిరాధార వార్తలను నమ్మొద్దని తెలిపారు. మోహన్‌బాబు విశ్వవిద్యాలయం ఈ సిఫార్సులను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అవి కేవలం సిఫార్సులు మాత్రమే. ఈ వ్యవహారం ప్రస్తుతం ఏపీ హైకోర్టులో విచారణలో ఉంది. APHERMC సిఫార్సులకు వ్యతిరేకంగా విశ్వవిద్యాలయానికి అనుకూలంగా హైకోర్టు స్టే ఉత్తర్వును జారీ చేసింది. కోర్టు ఉత్తర్వును ధిక్కరించి దీనిని పోర్టల్‌లో పెట్టడం దురదృష్టకరం. APHERMC చేసిన సిఫార్సులు సరికాదని మోహన్‌బాబు విశ్వవిద్యాలయం గట్టిగా విశ్వసిస్తోంది. విశ్వవిద్యాలయ ప్రతిష్ఠను దిగజార్చడానికి ఉద్దేశపూర్వకంగా ఎంపిక చేసిన సమాచారాన్ని మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
ఇటువంటి నిరాధారమైన వార్తలను నమ్మొద్దని తల్లిదండ్రులకు, మీడియాకు తెలియజేస్తున్నాము. విచారణ సమయంలో మోహన్ బాబు యూనివర్శిటీ బృందం పూర్తిగా సహకరించిందని అదే కమిషన్ తన నివేదికలో పేర్కొనడం చూస్తే, ఎలాంటి తప్పు జరగలేదనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. మాకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ వస్తున్న వేలాది తల్లిదండ్రులకు, విద్యార్థులకు హృదయపూర్వక ధన్యవాదములు. మా ఛాన్సలర్ డాక్టర్ ఎం.మోహన్ బాబు మార్గదర్శకత్వంలో మేము ప్రపంచ స్థాయి సమగ్ర విద్యను అందిస్తూ యువతను శక్తిమంతం చేసే ప్రయత్నాన్ని కొనసాగిస్తాం’’ అని మంచు విష్ణు వెల్లడించారు.