యూత్ ఐకాన్ స్టార్ సిద్ధు జొన్నలగడ్ హీరోగా రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం తెలుసు కదా. ఈ సినిమాతో కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన దర్శకురాలిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాను దీపావళి కానుకగా అక్టోబరు 17న రిలీజ్ చేయబోతున్నారు. మూవీ ప్రమోషన్ లో భాగంగా తాజాగా మల్లిక గంధ అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ రాయగా తమన్ సంగీతం అందించాడు. సింగర్ సిద్ శ్రీరామ్ మరోసారి తనమార్క్ చూపించారు. పాటను అద్భుతంగా పాడాడు. ధమన్ మ్యూజిక్, సిద్ శ్రీరామ్ వాయిస్ పాటను ఎక్కడికో తీసుకువెళ్లింది.తంబురా, ఫ్లూట్ లాంటి ట్రెడిషనల్ వాయిద్యాలను మోడ్రన్ టచ్ లో వినిపించడం అదిరిపోయింది. సిద్ శ్రీరామ్ లిస్టులో మరో హిట్ పడినట్టే అని మ్యూజిక్ లవర్స్ అంటున్నారు. ఈ మెలోడీ సాంగ్ లో సిద్ధు, రాశీఖన్నా మధ్య రొమాంటిక్ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. కాగా ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ పాటను మీరు వినకపోతే ఓ సారి వినేయండి!
Sid Sriram : సిద్ శ్రీరామ్ ఇరగదీశాడు భయ్యా.. ‘మల్లిక గంధ’ సాంగ్ సూపర్!
మూవీ ప్రమోషన్ లో భాగంగా తాజాగా మల్లిక గంధ అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ రాయగా తమన్ సంగీతం అందించాడు. సింగర్ సిద్ శ్రీరామ్ మరోసారి తనమార్క్ చూపించారు. పాటను అద్భుతంగా పాడాడు.
New Update
తాజా కథనాలు