Jayaram Son Marriage: మలయాళ నటుడు జయరామ్ కుమారుడు కాళిదాస్ జయరామ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కాళిదాస్ తన చిన్ననాటి స్నేహితురాలు, మోడల్ తరిణీ కళింగరాయర్ ని వివాహం చేసుకున్నాడు. ఈరోజు ఉదయం కేరళలోని గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయంలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. Kalidas Jayaram and Tarini Kalingarayar embark on a beautiful journey together as they tie the knot in a traditional ceremony at Guruvayur Temple#KalidasJayaram #TariniKalingarayar #CelebrityWedding #TraditionalWedding #GuruvayurTemple #StarCouple #WeddingVibes #Jayaram #SIIMA… pic.twitter.com/6Jg9NBZzJa — SIIMA (@siima) December 8, 2024 Also Read: మోహన్ బాబు, మనోజ్ మధ్య కొట్లాట.. స్పందించిన మంచు ఫ్యామిలీ కాళిదాస్ పావ కదైగల్, విక్రమ్, ఇండియన్ 2 వంటి సినిమాల్లో కీలక పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వధువు తరణి మోడల్ గా రాణిస్తోంది. తరణి మిస్ యూనివర్స్ 2021 పోటీల్లో మూడో రన్నరప్ గా నిలిచింది. ఈ పెళ్లి వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాళిదాస్ తండ్రి జయరామ్ తెలుగులో అలవైకుంఠపురం, హాయ్ నాన్న, ధమాకా, గుంటూరు కారం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. Also Read : 'పుష్ప2' గంగమ్మ తల్లీ జాతర సీన్.. థియేటర్ లో పూనకాలతో ఊగిపోయిన మహిళ