/rtv/media/media_files/qTXifFmfFOa0wvqgjamf.jpg)
కన్నడ హీరో రిషబ్ శెట్టి హీరోగా నటించిన 'కాంతార' దేశ వ్యాప్తంగా ఎలాంటి సెన్సేషన్ ను క్రియేట్ చేసిందో తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అన్ని భాషల్లో అద్భుత విజయన్ని సొంతం చేసుకుంది. రీసెంట్ గా ఈ మూవీకి 2 నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చాయి. అందులో బెస్ట్ యాక్టర్ గా రక్షిత్ శెట్టి ఫస్ట్ టైం నేషనల్ అవార్డు అందుకున్నాడు.
తండ్రి పాత్రలో మలయాళ స్టార్..
కాగా ఈ సినిమాకు ప్రీక్వెల్ గా 'కాంతార-1' తెరకెక్కుతోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఓ అదిరిపోయే అప్డేట్ బయటికొచ్చింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మలయాళ అగ్ర నటుడు మోహన్‌లాల్ కీలక పాత్రలో నటించనున్నారని తెలిసింది. ఇందులో ఆయన హీరో రిషబ్‌శెట్టి తండ్రి పాత్రలో కనిపిస్తారని అంటున్నారు.
#KantaraChapter1 ಚಿತ್ರದಲ್ಲಿ #MohanLal ಅವರು ನಟಿಸುತ್ತಿಲ್ಲ.
— ರಾಜಧಾನಿಹೈಕ್ಲು (@RajdhaniHaiklu) October 1, 2024
ನಿರ್ದೇಶನ #RishabShetty
ನಿರ್ಮಾಣ #HombaleFilms#AppuLiveson #Kantara #Kantara2 #RajdhanjHaiklu pic.twitter.com/478xGByRXE
గత ఏప్రిల్‌లో మోహన్‌లాల్‌ను ఆయన స్వగృహంలో కలుసుకున్నారు రిషబ్‌శెట్టి. ఆ సమయంలోనే వారిమధ్య ప్రీక్వెల్‌కు సంబంధించిన చర్చలు జరిగాయని చెబుతున్నారు. ‘కాంతార-1’లో మోహన్‌లాల్ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందని అంటున్నారు.
𝐈𝐍𝐃𝐔𝐒𝐓𝐑𝐘 𝐇𝐈𝐓 #ಕಾಂತಾರ ಚಿತ್ರದ 𝗣𝗿𝗲𝗾𝘂𝗲𝗹 “ಕಾಂತಾರ Chapter 1” ತಾರಾಗಣಕ್ಕೆ Mollywood Superstar ಮೋಹನ್ ಲಾಲ್ ಸೇರಿಕೊಳ್ಳುತ್ತಿದ್ದಾರೆ ಎಂಬ ಸುದ್ದಿ ಸ್ಯಾಂಡಲ್ ವುಡ್ ಅಂಗಳದಲ್ಲಿ ದಟ್ಟವಾಗಿ ಹಬ್ಬಿದೆ 🤗#NamCinema #Kantara #Kantara2 #mohanlal #DivineBlockbusterKantara #kantarasongs… pic.twitter.com/MVxTl63A5b
— 𝐍𝐀𝐌𝐂𝐈𝐍𝐄𝐌𝐀 (@NamCinema) September 30, 2024
ఇదే కనుక నిజమైతే 'కాంతార'కు మోహన్ లాల్ రోల్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవడం గ్యారెంటీ అని చెప్పొచ్చు. KGF, సలార్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ ను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవి కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Also Read : దళపతి విజయ్ కి విలన్ గా బాలీవుడ్ స్టార్