/rtv/media/media_files/2024/12/30/BSkITML9Qx0ckmhEIBes.jpg)
dilip Shankar
Dilip Shankar: మలయాళ ప్రముఖ నటుడు దిలీప్ శంకర్ తిరువనంతపురంలోని వాన్‌రోస్ జంక్షన్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో అనుమానాస్పదంగా మృతి చెందాడు. పలు నివేదికల ప్రకారం.. సీరియల్ షూటింగ్ కోసం నాలుగు రోజుల క్రితం తిరువనంతపురం వెళ్లిన దిలీప్ స్టే కోసం అక్కడే ఒక హోటల్ లో రూమ్ తీసుకున్నాడు. అయితే గత రెండు రోజులుగా గది నుంచి బయటకు రాకపోవడంతో.. అతడు స్టాఫ్ ఫోన్ కాల్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించాడు. కానీ ఫోన్ కలవకపోవడంతో స్టాఫ్ మెంబర్ విచారణ కోసం హోటల్ కి వెళ్ళాడు. అనంతరం హోటల్ సిబ్బంది దిలీప్ ఉంటున్న రూమ్ తలుపులు తెరిచి చూడగా మృతదేహంగా కనిపించాడు. ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: ఆరోజు 'పుష్ప' నిర్మాతలే థియేటర్ తీసుకున్నారు.. నోటీసులపై సంధ్య థియేటర్ రిప్లై
ఆనారోగ్య సమస్యలు..
దిలీప్ శంకర్ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు కూడా నివేదికలు తెలిపాయి. దిలీప్ మలయాళంలో పలు సినిమాలు, సీరియల్స్ చేశాడు. సుందరి, పంచాగ్ని వంటి పాపులర్ టీవీ సీరియల్స్ చేశారు. ఆయన హఠాత్మరణం అభిమానులందరినీ షాక్ కి గురిచేసింది. స్నేహితులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు. దిలీప్ కో యాక్టర్ సీమా నాయర్ సోషల్ మీడియా వేదికగా తన బాధని వ్యక్తం చేస్తూ ఇలా రాసుకొచ్చారు.. ఐదు రోజుల క్రితం మీరు నాకు కాల్ చేశారు కదా? ఆ తల నొప్పిగా ఉండడం వల్ల మాట్లాడలేకపోయాను. ఇప్పుడు ఒక జర్నలిస్టు ఫోన్ చేసినప్పుడు మీ గురించి తెలిసింది! దిలీప్ మీకు ఏమైంది! ఏం రాయాలో తెలియడం లేదు అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
Also Read: Allu Arjun: అల్లు అర్జున్ జోలికి వస్తే చంపేస్తాం! OU జేఏసీ సంచలన ఆరోపణలు
Also Read: యూట్యూబ్ ను షేక్ చేసిన ఏకైక ఇండియన్ సాంగ్..'కుర్చీ మడతపెట్టి' నయా రికార్డ్