Bigg Boss 9: షాకింగ్ న్యూస్.. ఆటలో భరణికి సీరియస్ .. మళ్ళీ హౌజ్ నుంచి అవుట్!

బిగ్ బాస్ సీజన్ 9 ఎనిమిదవ వారం ఇంట్రెస్టింగ్ సాగుతోంది. హౌజ్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ లో మళ్ళీ ఒకరికి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం కల్పించాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా నిన్నటి ఎపిసోడ్ లో దమ్ము శ్రీజ, భరణి ఇద్దరినీ ఇంట్లోకి పంపారు.

New Update

Bigg Boss 9: బిగ్ బాస్ సీజన్ 9 ఎనిమిదవ వారం ఇంట్రెస్టింగ్ సాగుతోంది. హౌజ్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ లో మళ్ళీ ఒకరికి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం కల్పించాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా నిన్నటి ఎపిసోడ్ లో దమ్ము శ్రీజ, భరణి ఇద్దరినీ ఇంట్లోకి పంపారు. అయితే వీరిద్దరిలో ఒకరికి మాత్రమే పర్మనెంట్ హౌజ్ మేట్ అయ్యే అవకాశం ఉంటుంది. దీని కోసం శ్రీజ అండ్ భరణికి కొన్ని టాస్కుల్లో పాల్గొనాల్సి ఉంటుందని తెలిపారు బిగ్ బాస్.  ఈ టాస్కులో భాగంగా శ్రీజ, భరణి మిగతా కంటెస్టెంట్ల నుంచి తమ సైనికులుగా ఎవరు ఉండాలో నిర్ణయించుకొని.. రెండు టీమ్స్ గా విడిపోవాల్సి ఉంటుంది. శ్రీజ..  గౌరవ్, డెమోన్ పవన్ ని తన సపోర్టర్స్ గా ఎంపిక చేసుకోగా,  భరణి తరుపున  ఇమ్మాన్యుయేల్, నిఖిల్ ఆటలోకి దిగారు.  

భరణికి గాయం 

ఇక శ్రీజ, భరణిల్లో ఒకరు పర్మనెంట్ హౌస్ మేట్​గా మారడానికి రెండు టీమ్స్​ మధ్య టాస్కులు మొదలయ్యాయి. అయితే తాజాగా విడుదలైన ప్రోమోలో ఇరు  టీమ్స్ మధ్య పోటాపోటీగా టాస్కులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ టాస్క్ ఆడుతున్న క్రమంలో భరణికి తీవ్రంగా గాయపడినట్లు ప్రోమోలో కనిపించింది. దీంతో వెంటనే ఆయనను మెడికల్ రూమ్ కి తీసుకెళ్లగా.. డాక్టర్ పరీక్షించారు. భరణి కండీషన్ కాస్త సీరియస్ కావడంతో బయట హాస్పిటల్ కి వెళ్లాలని సూచించారు. ఈ మేరకు భరణిని హౌజ్ నుంచి బయటకు తీసుకెళ్లారు. 

Advertisment
తాజా కథనాలు