Mahesh Babu : మరో బిజినెస్ లోకి మహేష్ బాబు ఎంట్రీ.. మహేష్ బాబు మరో బిజినెస్ లోకి అడుగుపెట్టనున్నాడట. హైదరాబాద్ కు చెందిన 'వెల్‌నెస్ బ్రాండ్ ఫిట్ డే' అనే స్టార్టప్ కంపెనీలో మహేశ్ పెట్టుబడులు పెట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ కంపెనీ హెల్త్ సప్లిమెంట్స్ ప్రోటీన్, ప్రోటీన్ బార్ ఉత్పత్తులను అమ్మనుంది. By Anil Kumar 12 Sep 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రీల్ లైఫ్ లోనే కాదు..రియల్ లైఫ్ లోనూ బిజినెస్ మ్యాన్ అనిపించుకుంటున్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పలు వ్యాపారాల్లో రాణిస్తున్నారు. ఇంకోవైపు కొన్ని బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తూ యాడ్స్ లో నటిస్తున్నారు. ఇప్పటికే ఆయన ఖాతాలో మల్టీప్లెక్స్ బిజినెస్, రెస్టారెంట్, క్లాతింగ్ బ్రాండ్స్ ఉన్నాయి. కొత్త బిజినెస్ లోకి.. ఇక తాజాగా ఆయన మరో కొత్త బిజినెస్ లోకి అడుగుపెట్టనున్నాడనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. హైదరాబాద్ కు చెందిన 'వెల్‌నెస్ బ్రాండ్ ఫిట్ డే' అనే స్టార్టప్ కంపెనీలో మహేశ్ బాబు పెట్టుబడులు పెట్టనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కంపెనీ పోషకాహార విలువలు కలిగిన హెల్త్ సప్లిమెంట్స్ ప్రోటీన్, చిప్స్, ప్రోటీన్ బార్ లాంటి ఉత్పత్తులను అమ్మనుంది. హెల్త్ కు సంబంధించిన సంస్థ కావడంతో మహేష్ ఇందులో భారీగా ఇన్వెస్ట్ చేసేందుకు మహేష్ ఆసక్తి చూపుతున్నట్లు సన్నిహిత వర్గాల ద్వారా సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే దీనిపై పూర్తి స్పష్టత వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే. ఇక మహేష్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన.. దర్శక ధీరుడు రాజమౌళితో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. గ్లోబల్ అడ్వెంచరస్ ప్రాజెక్టుగా రాబోతున్న ఈ చిత్రం పాన్ వరల్డ్ లెవెల్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది. సీనియర్ నిర్మాత కె.ఎల్ నారాయణ శ్రీదుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై దీన్ని నిర్మించనున్నారు. ఈ సినిమా కోసమా ఏకంగా రూ.1000 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయిస్తున్నట్లు టాక్. మహేష్ సరికొత్త లుక్ లో కనిపించనున్న ఈ సినిమాలో పలువురు హాలీవుడ్ నటీ,నటులు సైతం భాగం కానున్నారు. వచ్చే ఏడాది జనవరిలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. #mahesh-babu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి