మళ్ళీ విదేశాలకు మహేష్ బాబు.. సూపర్ స్టార్ స్టైలిష్ లుక్ వైరల్

మహేశ్‌ బాబు ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు బయలు దేరాడు. ఈ క్రమంలోనే ఆయన నయా లుక్ బయటికొచ్చింది. ఎయిర్ పోర్ట్ లో లాంగ్‌ హెయిర్‌, గడ్డం, రెడ్‌ క్యాప్‌, హుడీ వేసుకుని స్టైలిష్‌గా నడిచి వస్తున్న పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

New Update
52

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మధ్య విదేశాలకు వెళ్తున్నాడు. అందులో కొన్నిసార్లు ఫ్యామిలీతో కలిసి వెళ్తే, ఇంకొన్ని సార్లు సింగిల్ గా వెళ్ళాడు. అది కూడా రాజమౌళి సినిమా కోసం. మహేష్ ఎప్పుడు ఫారిన్ వెళ్లినా కూడా ఎయిర్ పోర్ట్ లో ఆయన లుక్స్ క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. #SSMB29 సినిమా కోసం మహేష్ కంప్లీట్‌ కొత్త అవతారంలో కనిపించబోతున్నవిషయం తెలిసిందే.

మరో అవతారంలో మహేష్..

ఇప్పటికే లాంగ్‌ హెయిర్‌, పోనీ టెయిల్‌తో కనిపించిన ఈ హీరో.. తాజాగా మరో స్టైలిష్ లుక్‌లో కనిపించి టాక్ ఆఫ్‌ ది టౌన్‌గా నిలుస్తున్నాడు. ఈ సినిమా కోసం మహేశ్‌ బాబు మరోసారి మేకోవర్ మార్చేసుకుని.. కొత్త కొత్త గెటప్స్‌లో కనిపిస్తూ నెట్టింట సందడి చేస్తున్నాడు. తాజాగా మహేశ్‌ బాబు ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్తున్న సమయంలో ఎయిర్‌పోర్టులో లాంగ్‌ హెయిర్‌, గడ్డం, రెడ్‌ క్యాప్‌, హుడీ వేసుకుని స్టైలిష్‌గా నడిచి వస్తుండగా.. అక్కడే ఉన్న కెమెరాలు క్లిక్‌మనిపించాయి. 

Also Read : అప్పుడు పొగిడి, ఇప్పుడు తిట్టి.. పవన్, ప్రకాష్ రాజ్ పంచాయితీకి కారణమిదే?

తాజాగా ఫొటోలు జక్కన్న సినిమాపై క్యూరియాసిటీ మరింత పెంచేస్తు్న్నాయి. ఈ పిక్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. #SSMB29 కోసం మహేష్ ఇంతలా మేకోవర్ అవుతున్నాడంటే అసలు రాజమౌళి ఆయనతో ఎలాంటి సినిమా ప్లాన్ చేశారోనని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. కాగా ఈ మూవీ అప్‌డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 

ఈ మూవీకి గరుడ, గోల్డ్ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లు ఇప్పటికే వార్తలు వినిపించాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. శ్రీదుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాత కె.ఎల్. నారాయణ సుమారు వెయ్యి కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు